బోర్డ్ ఆఫ్ డిసబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 18 వరకు నేపాల్ లో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకు ఆంధ్ర రాష్ట్రం నుండి భారత్ జట్టుకు శివకోటి ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లా నందలూరు విలేకరుల సమావేశంలో శివకోటి మాట్లాడుతూ, తన ఎంపికకు సహకరించిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా వారికి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి, కడప డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ వారికి, స్థానిక నందలూరు సబ్ సెంటర్ వారికి, సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ, నా కోచ్ లందరికీ మరియు పాత్రికేయ విలేకరులందరికీ హృదయపూర్వకంగా శివకోటి కృతజ్ఞతలు తెలియజేశారు. నేపాల్ జట్టుతో నేపాల్ లో జరగబోయే ఈ టి20, వన్డే సిరీస్లో భారత్ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తానని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు వెళతానని శివకోటి ఆశాభావం వ్యక్తం చేశాడు. పుట్టిన ఊరు నందలూరు కీర్తి ప్రతిష్టలను దేశ నలమూలల గుర్తుండిపోయేలా చాటుతానని శివకోటి ఘంటాపథంగా తెలియజేశారు.
previous post
next post