28.7 C
Hyderabad
April 20, 2024 06: 21 AM
Slider రంగారెడ్డి

రాచకొండ కమిషనరేట్ లో ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు

Mahesh Bhagawath

లాక్ డౌన్ సమయంలో సీనియర్ సిటీజన్స్ మెడికల్ సర్వీసు కోసం ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. 24 గంటల పాటు ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 5 వాహనలు అందుబాటులో ఉంటాయని, వీటితో పాటు రెండు అంబులెన్స్ లను ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. మహేంద్ర లాజిస్టిక్ లిమిటెడ్ కంపెనీ, రాచకొండ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎమర్జెన్సీ వాహనాలు ఉంటాయని మహేష్ భగవత్ తెలిపారు.

లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ సర్వీసు కోసం వాహనాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి ఈ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 8433958158 ఫోన్ చేసి వాహనాల సర్వీస్ ను ఊపయోగించుకోవాలని ఆయన తెలిపారు.

9490617234  కరోనా కంట్రోల్ రూమ్ కు కాల్ చేస్తే అంబులెన్స్ లను అందిస్తామని కూడా ఆయన తెలిపారు. ఐలైట్ వాహనాలు ఫుడ్ సప్లై, మెడిసిన్ సప్లై, కోసం వీటిని ఉపయోగిస్తారు. సైకో సోషల్ కౌన్సిలింగ్ ను రాచకొండ కమిషనరేట్ లో ఏర్పాటు చేసాము. మానసికంగా న్యూనతకు గురైన వారికి  వైద్య సేవలు అందిస్తున్నాము అని ఆయన తెలిపారు. లాక్ డౌన్ పిరేడ్ మొత్తం ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

Related posts

ఫేక్ న్యూస్ ను కొట్టి పారేసిన జూపల్లి అనుచరులు

Satyam NEWS

కోదండ రామాల‌యం పునః నిర్మాణానికి మంత్రి అల్లోల‌ భూమి పూజ

Satyam NEWS

ప్రయాణీకుల సౌకర్యం కోసం వియవాడ డివిజన్ నుంచి మరిన్ని రైళ్లు

Satyam NEWS

Leave a Comment