37.2 C
Hyderabad
April 19, 2024 12: 50 PM
Slider గుంటూరు

జీతం పెర‌గ‌దు.. జీవితం త‌ర‌గ‌దు..

salary

పొరుగు సేవల, ఒప్పంద ఉద్యోగి అనగానే సామాన్యంగా ప్రతి ఒక్కరికి కలిగే భావన .. మనం చెప్పిందే వారు చేయాలి కాదు కూడదు అంటే ఉద్యోగం నుండి తీసివేస్తారనే భయం..ఆ భయం మనల్ని బానిసల్ని చేసింది .. ఉద్యోగం ఒకటి చేసే పని ఇంకొకటీ వుంటుంది స్వీపర్ పని, హమాలి పని, వాచ్ మెన్ పనులు చేయించుకుంటారు ఇంకొందరైతే ఇంటి పనులు వంట పనులు ఒంటి పనులు చేయించుకుంటూ ఆ భయాన్ని బానిసలుగా చేసి పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగులను వాడుకుంటారు.

కానీ జీతం మాత్రం శూన్యం జీతం పేరగదు-జీవితం తరగదు అనేనానుడి నిజం చేస్తూ నిత్యం నరకయాతన గురి అవుతూ కుటుంబ భాధ్యతను బంధాన్ని నెట్టుకొస్తున్నారు. పాలకులు అధికారులు చోద్యం చూస్తూ వారి సేవలు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి తీరుతో పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగులు విసిగి వేసారిపోతున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ జీవితాలు మాత్రం అలానేవుంటున్నాయి.
నవీన సాంకేతిక నాగరికతకు అద్దం పడుతున్న ఈ రోజుల్లో సాటి కూలీకి దక్కిన గౌరవం కూలీ కూడా పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగికి దక్కటం లేదంటే వారి స్థితి వారి స్థానం ఏమిటో చెప్పనక్కరలేదు ఒక పక్క బాధత మరోవైపు బానిసత్వం బాధ్యతను మరవక బానిసత్వాన్ని అలవాటు చేసుకోవలసి వస్తుంది.

వేలకు వేలకు జీతాలు ఆర్జించే పాలకులకు అధికారులకు సామాన్య ఉద్యోగుల సాధక బాధకాలు పట్టకపోవడం బాధాకరం. పాలక అధికారులారా ఒకసారి మమ్మల్ని గమనించండి మాకు కుటుంబాలున్నాయి అయినా మేము మిమ్మల్ని విడనాడటం లేదు మా పొరుగు, ఒప్పంద సేవల కుటుంబ సభ్యులతో కంటే మీ బాగోగులే ముఖ్యమని యోచిస్తున్నాం.

అయినా మమ్మల్ని కాలికింద ధూళిలా చూస్తూ మా మానసిక స్వతంత్రతను హరిస్తున్నారు. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఎలా బ్రతకాలి ఆలోచించండి…మమ్మల్ని గుర్తించి ఆదరించండి అని ఒప్పంద వేతన ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు.

Related posts

నా మతం కులంపై చెడు ప్రచారం చేస్తున్నారు

Satyam NEWS

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు వైసీపీ నేతల అభినందనలు

Satyam NEWS

తిరుమల శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు

Satyam NEWS

Leave a Comment