ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల నిరసనలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కొల్లాపూర్ ఆర్టీసీ కార్మికులు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు కార్మికుల నిరసనలో కూర్చున్నారు. సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలపై సభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్రవహించారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆసరా పింఛన్ సమానంగా రిటెర్డ్ తర్వాత కేవలం రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేయడంలో న్యాయం ఉందన్నారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ సమ్మె జరగడానికి,ప్రజలు ఇబ్బంధులు ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంమన్నారు. కార్మికుల సమస్య ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. కార్మికుల సమ్మెకు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోరాటం జరగబోతుందన్నారు. అంతకు ముందు తెలంగాణ మాజ్దూర్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య నాయకులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కాశీపురం మహేష్,ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు
previous post