నిజామాబాద్ కోటగిరి ఎంపీడీఓ అత్తారుద్దీన్, ఏపీఓ రమణ లు కోటగిరి మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాస్కులు, సానిటైజర్లు పంపిణీ చేశారు.సర్పంచ్ స్వయంగా పలుగు పట్టి పనిచేసే తీరును కూలీలకు వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ లాక్ డౌన్ వేల గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధి హామీ పనులను ప్రారంభించిందని తెలిపారు. ప్రస్తుతం చెరువు పూడిక పనులు చేయించాల్సి ఉన్నా కూలీలు సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో పంట కాలువలు తీయిస్తున్నట్టు తెలిపారు. ఉపాధి హామీ పనులకు వచ్చే ప్రతిఒక్కరికీ మాస్కులు పంచామని, కూలీల సంఖ్య పెరిగితే వారికి కూడా మాస్కులు పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు దయానంద్, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.