28.7 C
Hyderabad
April 25, 2024 05: 16 AM
Slider నిజామాబాద్

లాక్డౌన్ ఎత్తివేసే వరకూ ఉపాధి పనులు పెట్టవద్దు

village youth

బిచ్కుంద మండలంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఎత్తివేసే వరకూ ఉపాధి పనులు చేపట్టరాదంటూ మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు ఎంపిడిఓ ఆనంద్ పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఉపాధి హామీ కూలీలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఒకేచోట గుమిగూడి పనులు చేస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశముందని కావున లాక్ డౌన్  పూర్తయ్యేంత వరకు ఈ పనులు చేపట్టరాదంటూ వారు వినతిపత్రంలో అధికారులను కోరారు.

నిరుపేద ప్రజలకు సామాజిక దూరం పాటించే అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. కావున లాక్డౌన్ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి పనులు కల్పించి ఆదుకోవాలని వారు వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాల చేతన్ గణేష్ గొoడా పత్తి రమేష్, హు౦డే బస్వరాజ్ గజానంద్ రెడ్డి బాససహదేవ్ వెంకటేష్ సాయిరామ్ రాజేష్ పాల్గొన్నారు.

Related posts

విహార యాత్రలో విషాదం

Satyam NEWS

కొల్లాపూర్ లో జూపల్లి వర్గీయుల నూతన సంవత్సర వేడుకలు

Satyam NEWS

న్యూజెర్సీలో అట్టహాసంగా బోనాల జాత‌ర‌

Bhavani

Leave a Comment