ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై అవగాహన నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి సమావేశ మందిరంలో తేదీ 24 9 2021 ఉదయం 11:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:30 వరకు గది సంఖ్య 104 లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ డీపీఆర్ఓ హాజరవుతున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారుపథకం యొక్క విధి విధానాలు దరఖాస్తు విధానం కావలసిన దస్త్రాలు విలువైన అంశాల పైన అవగాహన కల్పిస్తున్నట్లు అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు స్వయం సహాయక బృందాలు సొసైటీ చట్టం 1860 కింద నమోదైన సంస్థలు ఉత్పత్తి సహకార సంఘాలు ట్రస్టులు ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులని సూచించారు.
తయారీ రంగ పరిశ్రమలకు గరిష్టంగా ప్రాజెక్టు వ్యయ పరిమితి 25 లక్షల వరకని సేవారంగ పరిశ్రమలకు10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ పథకంలో 25 శాతం నుండి 35 శాతం వరకు సబ్సిడీని పొందవచ్చునన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు స్వయం సహాయ బృందాలు పాల్గొనాలని ఆయన కోరారు.