33.2 C
Hyderabad
April 25, 2024 23: 33 PM
Slider పశ్చిమగోదావరి

వెలుగులోకి వస్తున్న ఉపాధి హామీ అక్రమాలు

#Employment guarantee

ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో 30 గ్రామ పంచాయతీలలో 2021.2022 సంవత్సరాలలో జరిగిన ఉపాధి హామీ పనుల పై మండల పరిషత్ కార్యాలయం లో బుధవారం జరిగిన సామాజిక ప్రజా బహిరంగ విచారణ లో ఆదినుం డి అంతం వరకు అంతులేని అవి నీతి అక్రమాలే వెలుగు చూశాయి. బాపిరాజుగూడెం లో పీల్డ్ అసిస్టెంట్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న వారి పేర్లు మ స్టర్ లలో చూపి కరువు నిధులు స్వాహా చేసినట్టు తేలింది. పాతూరి చెరువు పనుల్లో 700 క్యూబిక్ మీటర్ ల కొలతల్లో తేడా చూపి నిధులు కాజేశారని.

పెళ్లై గ్రామం నుండి వెళ్లిపోయిన మహిళల పేర్లు మస్టర్ లలో చూపించి కూలి డబ్బులు లేపేశారు.ఇరిగేషన్ చెరువులో 2వారాలు పనులు చేసిన పనులకు చెల్లించిన పేమెంట్ లకు ఆధారాలు లేవని విచారణలో వెలుగు చూసింది. తాళ్లగోకవరం గ్రామం లో జరిగిన అక్రమాలపై కూలీలకు పీల్డ్ అసిస్టెంట్ మధ్య వివాదం తలెత్తి పీల్డ్ అసిస్టెంట్ అక్రమాలు బయట పెట్టారు.కవ్వగుంట గ్రామం లో జరిగిన లక్షలాది రూపాయల కరువు పనుల కు సంబంధించిన రికార్డ్ లు మాయమయ్యాయి అని తేలింది.

వేగివాడలోచేయాల్సిన కరువు పనులను అప్పటి టి ఏ సహకారం తో కె కన్నాపురం పీల్డ్ అసిస్టెంట్ వేగివాడ మస్టర్ ల పై కె కన్నాపురం గ్రామంలో చేయించి వేగివాడకు చెందిన 580 మంది కూలీల కడుపు కొట్టి అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో బహిర్గతమైంది. విజయరాయి లో మృతి చెందిన వారి పేర్లు మాస్టర్ లలో చూపి పేమెంట్ చేశారు.హోసింగ్ పనుల్లో 40 రోజులు.అదనంగా మరో 20 రోజులు.ఎన్ ఐ సి లో మరో 50 రోజులు నిబంధనలు అతిక్రమించి పీల్డ్ అసిస్టెంట్ పేమెంట్ చేసుకున్నట్టు తేలింది.గ్రామం లో ఒక మహిళ ఇల్లు కట్టకుండా కట్టినట్టు చూపి పేమెంట్ చేశారు.

ఒక చెరువులో వారం రోజులు పనులు చేయకుండా పేమెంట్ లు చేశార నితేలింది.చక్రాయగూడెం లో ఒక విద్యుత్ ఉద్యోగి పేరు. ఆశా వర్కర్ .అంగన్ వాడి టీచర్ లను కూడా కరువు పనులు చేయక పోయినా చేసి నట్టు చూపి పేమెంట్ లు చేసి పీల్డ్ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడి ఉపాధి హామీ పథకం గొప్పతనాన్ని బజారుకీడ్చి జిల్లా అధికారుల కళ్ళు గప్పి కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడటం పై డ్వామా పి డి రాంబాబు బాద్యులైన టి ఏ ల.పీల్డ్ అసిస్టెంటల నుండి రికవరీ పెట్టమని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమ లో ఎం పి పి తాతా.

రమ్య ఏ పి డి పురుషోత్తమ్ రావు.ఎం డి ఓ రాజ్ మనోజ్.పెదవేగి ఏ పి ఓ హేమలత పాల్గొన్నారు.ఈ విచారణ లో తాళ్లగోకవరం టి ఏ పై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.గ్రామం లో రాజు పొలాల్లో రైతులకు తెలియకుండా పనులు చేయకుండా చేసినట్టు మస్టర్ లు వేసి సొమ్ములు కాజేశారని రైతులు కూడా అధికారులకు పిర్యాదు చేయడం విశేషం.ఈ సంఘటన పై పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని అప్పుడే అసలు నిజాలు వెలుగులోకొస్తాయని పి డి రాంబాబు రైతులకు సర్ది చెప్పారు

Related posts

చేసిన అప్పులో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి?

Satyam NEWS

శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

Bhavani

గ్రీవెన్స్: తప్ప తాలు పేరిట కోత పెట్టడం సరికాదు

Satyam NEWS

Leave a Comment