28.7 C
Hyderabad
April 20, 2024 10: 36 AM
Slider ప్రపంచం

ఆఫ్ఘన్ సరిహద్దులో ఎన్ కౌంటర్: 10 మంది హతం

#terroristsattack

పాకిస్తాన్ భద్రతా దళాలు వాయువ్య ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) కమాండర్‌తో పాటు మరో 10 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. లక్కీ మార్వాట్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు టిటిపి కమాండర్ టిప్పుతో పాటు మరో 10 మందిని హతమార్చాయని భద్రతాదళాల అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కొంతమంది భద్రతా సిబ్బంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి కానీ అవి ధృవీకరణ కాలేదు.

ఆఫ్ఘన్ సరిహద్దు నుండి వచ్చిన టిటిపి ఉగవాదులు భద్రతా దళాలకు తారసపడ్డారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) గత జూన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని సోమవారం రద్దు చేసింది. పాకిస్తాన్ అంతటా దాడి చేయాలని TTP తన యోధులను ఆదేశించింది. వివిధ ప్రాంతాలలో ముజాహిదీన్ (మిలిటెంట్లు)పై సైనిక కార్యకలాపాలు జరుగుతున్నందున, దేశవ్యాప్తంగా సాధ్యమైన చోట దాడులు చేయడం అత్యవసరం అని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా మంగళవారం పదవీ విరమణ చేయనుండగా ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తున్నది. TTPని పాకిస్థానీ తాలిబాన్ అని కూడా అంటారు. TTP 2007 సంవత్సరంలో వివిధ తీవ్రవాద సంస్థల ఉమ్మడి సమూహంగా ఏర్పడింది. ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ మరియు లక్కీ మార్వాట్ ప్రాంతాల్లో మిలీషియా తరచుగా దాడులు చేయడంతో ఒప్పందం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు నిషేధిత సమూహం తెలిపింది.

Related posts

అన్ని శాఖల సమన్వయంతోనే ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి

Satyam NEWS

బూస్టర్ డోస్ పంపిణీ కి టీకాలు సరఫరా చేయండి

Bhavani

కార్పొరేట్ కాలేజీల ఆగడాలు అరికట్టాలి

Satyam NEWS

Leave a Comment