27.7 C
Hyderabad
April 20, 2024 00: 20 AM
Slider జాతీయం

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

#Starter Up

తెలుగు రాష్ట్రాల్లోని  పల్లె ప్రజల్లో దాగివున్న సృజనాత్మక శక్తి ని వెలికి తీయడమే మా లక్ష్యమని పల్లె సృజన ఆర్గనైజేషన్ కో ఆర్డినేటర్ బి.సుభాష్ చందర్ అన్నారు.

సికింద్రాబాద్ లోని వాయుపురిలో ఉన్న పల్లె సృజన కార్యాలయం ను బుధవారం సందర్శించిన కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ జిల్లా కార్యదర్శి మల్లప్ప పటేల్ తో ఆయన మాట్లాడారు. గ్రామీణులు ఆవిష్కరించిన రైతులకు ఉపయోగ పడే పరికరాలను చూపించారు.

ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ మాట్లాడుతు ఆర్మీలో టెక్నికల్ ఇంజనీరుగా పనిచేసి పదవి విరమణ పొందిన పోగుల గణేశo  2005 లో ఈ సంస్థను స్థాపించారని తెలిపారు.

ఈ సంస్థ ద్వారా  గ్రామీణ ప్రాంతాల ప్రజలు 0-12వ తరగతి లోపు చదివిన వారిలో  దాగివున్న సృజనాత్మకశక్తిని గుర్తించి వారి ఆవిష్కరణలు వెలుగులోకి తెస్తామని తెలిపారు. మా సంస్థ గ్రామాల్లో  శోదయాత్రలు చేపడతామని తెలిపారు. ఆ యాత్రలో పాఠశాలలు, కాలేజిలు సందర్శిస్తామని తెలిపారు.

ప్రజలకు అవసరమయ్యే పరికరాలు ఏమిటో తెలుసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు అవగాహన కల్గిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఆవిష్కరించిన వాటిని ప్రదర్శిస్తామని తెలిపారు.

మా సంస్థ ద్వారా ఆవిష్కర్తలను గుర్తిoచడం,వారి ఆవిష్కరణలకు మెరుగులు దిద్దడం, డాక్యుమెంట్ చేయడం,వారికి పేటెంట్ హక్కులు ఇప్పించడం,అవార్డులు వచ్చేవిధంగా చూడటం,వారి ఉత్పత్తులను  ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం, మార్కెట్ కల్పించడం లాంటి పనులుచేపడతామని తెలిపారు.

మా సంస్థ ప్రోత్సహం తో పాలు పితికే యంత్రం, కలుపు తీసే పరికరాలు,పంక్చర్ కాని మోటార్ సైకిల్ ట్యూబ్, సైకిల్ నాగలి,అడవి పందులను పారద్రోలే అలారం,కరెంట్ స్థంభం ఎక్కడానికి చెప్పులు,రొట్టెలు చేసే యంత్రం,సోలార్ తో పనిచేసే మొబైల్ చార్జర్, స్ప్రేయర్, రసాయానిక ఎరువులు చల్లే పరికరం లాంటి 200 ఆవిష్కరణలు ఉన్నాయని తెలిపారు.

వీరిలో 13మందికి రాష్ట్రపతి అవార్డులు, ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయని తెలిపారు.22మంది ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు కల్పించామని  తెలిపారు.56 రకాల ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయని తెలిపారు. వీరి ఉత్పత్తులతొ 5లక్షలమందికి మేలు జరుగుతుందని తెలిపారు.

ప్రచారం కోసం పల్లె సృజన అనే ద్వైమాసిక పత్రికను నడుపుతున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సికింద్రాబాద్ లోని వాయుపురిలో గల మా కార్యాలయం(పల్లె సృజన కార్యాలయం)సందర్శించవచ్చని తెలిపారు.

అలాగే www.pallesrujana.org వెబ్సైట్ లో వివరాలు చూడవచ్చని తెలిపారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే తనను (మొబైల్ నంబర్ 9652801700) సంప్రదించాలని తెలిపారు.

Related posts

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ బాధ్యుల నియామకం

Satyam NEWS

క్రిస్టియన్లకు నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బట్టల పంపిణీ

Satyam NEWS

ప్రజల కోసం పరితపించే నాయకుడు కేటీఆర్

Satyam NEWS

Leave a Comment