27.7 C
Hyderabad
April 25, 2024 07: 42 AM
Slider సంపాదకీయం

ఎండ్ ఆఫ్ ట్రేడ్ వార్: చైనాతో వాణిజ్య ఒప్పందం ఓకే

america chaina

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. వాణిజ్య ఒప్పందంలో ఇరు దేశాలు కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు చేశామని ఆయన తెలిపారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక శక్తుల మధ్య కొద్ది కాలంగా వాణిజ్య యుద్ధం నెలకొని ఉంది.

ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ వృద్ధిని కూడా ప్రభావితం చేశాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా పన్నును 10 శాతం నుంచి 25 శాతానికి పెంచారు.  చైనా నుండి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించినట్లు 2018 జూన్ లో అమెరికా ప్రకటించిన అనంతరం వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది.

ఆ తర్వాత అమెరికా ఉత్పత్తులపై చైనా కూడా అధిక సుంకాలు విధించింది. ఇది వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. అయితే ఈ తీవ్రతను తగ్గించేందుకు కొన్ని ఉత్పత్తులపై పన్నులను తగ్గించాలని అమెరికా నిర్ణయంతో, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు చైనా నుండి భారీ డిమాండ్ వస్తోంది.

వాణిజ్య యుద్ధం తరువాత భారతదేశం నుండి చైనా, అమెరికాకు ఎగుమతులు విపరీతంగా పెరిగాయి.  ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఓఐ) ప్రకారం జూన్-నవంబర్‌లో భారతదేశం నుండి చైనాకు ఎగుమతులు సంవత్సరానికి 32 శాతం పెరిగాయి. భారత్ 846 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేసింది.  గత ఏడాది ఇదే కాలంలో 637 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేయగలిగింది.

జూన్-సెప్టెంబర్ కాలంలో భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతులు 12 శాతం పెరిగాయి. అదే సమయంలో, అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా చైనా పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఆటోమోటివ్, ఆయిల్ రిఫైనింగ్, స్టీల్‌తో సహా పలు రంగాల్లో లాభాలు మొదటిసారి పడిపోయాయి. వాణిజ్య యుద్ధాన్ని అంతం చేసే చర్యలో భాగంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.  కొన్ని ఉత్పత్తులపై పన్నులను తగ్గించాలని అమెరికా నిర్ణయించిన తరువాత చైనా మార్కెట్ కూడా స్పందించింది. వచ్చే నెలలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఆర్థిక కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ ప్రకటించారు.

Related posts

కోర్ట్ లో కేసు ఉండగా అరెస్ట్ అన్యాయం

Satyam NEWS

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

వెరైటీ ప్రొటెస్టు: ఏబీవీపీ విద్యార్ధుల ఉరి నిరసన

Satyam NEWS

Leave a Comment