పారిశుధ్య వ్యవహారమై హీటెక్కిన ఆలయ వ్యవహారం శనివారం క్లైమాక్స్ కు చేరింది.నిన్నటి వరకు ఈ.ఓ కృష్ణ వేణి కి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఆమెకు ఒక్క సారి గా అనుకూలం గా మారాయి.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీజేపీ నాయకులకు వ్యతిరేకం గా మున్సిపల్ వైస్ చైర్మను తో కూడిన కౌన్సిలర్ ల బృందం,తెరాసా నాయకులు ఈ.ఓ కు మద్దతు గా నిలిచారు.ఆలాగే స్థానిక ప్రజల నుండి ఈ.ఓ కె మద్దతు లభించ గా దేవాలయ ఉద్యోగులు ఆమె పక్షానే నిలబడటం విశేషం.
నిన్నకలేక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ కావడం తో పాటు మెమో జారీ చేయడం తో ఆవేదనకు గురైన ఈ.ఓ కంటతడి పెట్టగా కలెక్టర్ పంపిన ఫిర్యాదుకు స్పందించి ఎండోమెంట్ కమీషనర్ నేరుగా వేములవాడకు చేరుకొని సంఘటన పై విచారణ మొదలు పెట్టాడు. మొదట కమిషనర్ ఈ.ఓ తో కలిసి ఆలయ పరిసారాలు గుడి చెరువులో పారిశుధ్య నివారణకు ఇంజినీరింగ్ అధికారుల తో పరిశీలించి ప్రత్యేక సిబ్బంది తో పరిసారాలన్నీ శుభ్రం చేయించాడు. అనంతరం జరిగిన సంఘటన పై విచారణ జరిపారు.మున్సిపల్ అధికారికి వ్యతిరేకం గా కౌన్సిలర్లు,వైస్ చైర్మన్ వచ్చి చెత్త అక్కడ పోసింది వ్యాపా రస్తులది,లాడ్జి లో నుండి వేసినది అని చెపుతూ ఈ.ఓ కృష్ణ వేణి నిజాయితీ గల అధికారి అని ఆమెపై చర్యలు తీసుకోవద్దని కోరడం పలు సందేహాలకు తావిస్తుంది.
కలెక్టర్ కు వ్యతిరేఖం గా తెరాస
నిన్న కలెక్టర్ ఈ.ఓ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చెయ్యగా ఈ.ఓ ది తప్పు లేదని ,ఆ చెత్త దేవస్థానం ది కాదని ,మున్సిపల్ అధికారికి వ్యతిరేకం గా కౌన్సిలర్లు,వైస్ చైర్మన్ వచ్చి చెత్త అక్కడ పోసింది వ్యాపా రస్తులనేనని ,అక్కడ ఉన్న ప్రైవేట్ లాడ్జి లో నుండి వేసిన చెత్త అని అని చెపుతూ ఈ.ఓ కృష్ణ వేణి నిజాయితీ గల అధికారి అని ఆమెపై చర్యలు తీసుకోవద్దని కోరడంతాము మున్సిపల్ నుండి ఇలా జరగ కుండా చూస్తామని తెలుపగా తప్పు తెలుసుకోకుండా కలెక్టర్ తొందర పాటు ప్రదర్చించాడనే ఆరోపణలు వెలువడుతున్నాయి.ఉత్త పుణ్యానికే ఈ.ఓ ను కలెక్టర్ఏడిపించాడనే సానుభూతి వ్యక్తమవుతుంది.అయితే జరుగుతున్నా పరిణామాలపై ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందించి ఆయా నేతలను అక్కడికి పంపినట్లు తెలుస్తుంది.దీనితో ఈ అంశమై కలెక్టర్ వైపు కాకుండా ఈ.ఓ వైపే ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తుంది.
శత్రువుకు శత్రువు మిత్రుడా ?
వేములవాడ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ,బీజేపీ కౌన్సెలర్ లు,నాయకులు భక్తులకు కనీస వసతులు అందడం లేదని ధర్నా నిర్వహించి ముఖ్య మంత్రి కెసిఆర్ వేములవాడ ను పట్టించు కోవడం లేదని ఆరోపించగా కలెక్టర్ ఈ.ఓ ది తప్పని చెప్పిన బీజేపీ నాయకులకు అలుసు ఇవ్వద్దని ఆలోచన తోనే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందం గా ఇప్పటి కైతే ఈ.ఓ కు మద్దతు గా ఎమ్మెల్యే మున్సిపల్ వైస్ చైర్మన్,కౌన్సెలర్లను,తెరాస నాయకులను రంగం లోకి దించినట్లు తెలుస్తుంది.అయితే ఈ మద్దతు తో కలెక్టర్ ను ఇండైరెక్ట్ గా తప్పు పట్టడమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ నాయకుల మద్దతు ఆమెకే ?
తెరాస తమను విమర్శించడం తప్పు మున్సిపాలిటీ డి ననడం తో బీజేపీ నేతలు సైతం ఈ.ఓ కె మద్దతు పలికినట్లు తెలుస్తుంది.సమ్మక్క జాతర ఉంటుందని తెలిసి జిల్లా కలెక్టర్ పోలీస్ బందో బస్తు,అదనపు సిబ్బందిని ఎందుకు నియమించి లేదని ,అసలు అధికారులు పట్టించు కోకపోవడం తో నే యాత్రికులు ఇబ్బంది ఎదుర్కుంటున్నారని ఆరోపిస్తూ ఈ.ఓ కృష్ణ వేణి నిజాయితీని తాము శంకించడం లేదని వారు తెలిపారు.
ఈ.ఓ ఫై గుర్రుగా కలెక్టర్
తమ పరిధిలో పనిచేసే అధికారి అయినా ఈ.ఓ తానూ చెప్పిన మాటలు వినక తానూ తనిఖీ చేస్తున్న సమయం లో తనను కలవటానికి కుడా రాలేదని ఆగ్రహం తో ఉన్న కలెక్టర్ ఆమెకు మెమో జారీ చేసి సంజాయిషీ ఇవ్వాలని కోరగా సంజాయిషిని ఆలయ ఉద్యోగులతో పంపిన ఈ.ఓ కు కలెక్టర్ కార్యాలయంనుండి చుక్కెదురు అయింది.ఈ.ఓ స్వయం గా వస్తేనే సంజాయిషీ ఉత్తరం తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించడం తో దేవాలయ ఉద్యోగులు తిరుగు ముఖం పట్టారు.చివరికి కమిసైనర్ సలహాతో ఈ.ఓ నే వెళ్లి కలెక్టర్ ను కలిసి పరిస్థితి వివరించగా సంజాయిషీ ఉత్తరాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.
కమిషనర్ సయోధ్య ఫలించిందా
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కు ఈ.ఓ కృష్ణ వేణి పరిస్తుతులను వివరించి కంట తడి పెట్టగా సౌమ్యుడయినా అయన వెంటనే వేములవాడ కు చేరుకొని అధికారుల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తుంది.తన సర్వీస్ లో ఎవరితో మాట పడలేదని కలెక్టర్ మందలించడం బాధగా ఉందని ఆమె ఒక దశలో బదిలీ చేయమని కోరినట్లు తెలిసింది.చివరగా అన్ని ఫిర్యాదులను పరిశీలించి కలెక్టర్ ను ఒప్పించి కథ సుకాంతం చేసిన కమిషనర్ హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలిసింది.సంఘటన ఫై సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ,మంత్రి కేటీఆర్లు ఆరాతీసినట్లు తెలుస్తుంది.ఇప్పటికి సమస్య కొలిక్కి రాగ రానున్న రోజుల్లో ఎం జరుగు తుందో చూడాలి మరి.