వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో భక్తులకు వసతి సౌకర్యాల కల్పనలో ఆలయ ఈ.ఓ కృష్ణవేణి విఫలమైనదనే ఆరోపణలతో పాటు జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీచేయడం పై విచారించి సమస్యను సద్దుమణిగేలా చేయడానికి ఎండో మెంట్ కమీషనర్ అనిల్ కుమార్ మరికాసేపట్లో వేములవాడకు చేరుకోనున్నారు.వేములవాడ లో జరుగుతున్నా సంఘటనలపై ఎండోమెంట్ మంత్రి తో పాటు అధికారులు ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు ఈ మేరకు అయన రెండు రోజుల వ్యవధి లోనే మల్లి ఇక్కడికి వస్తున్నారని సమాచారాం.
ఆలయం లోభక్తులకు తాగు నీరు అందడం లేదని,పరిశుధ్యంసారిగా లేదని ,క్యూ లైన్ లు మెయింటైన్చేయడం లో నిర్లక్ష్యం చేశారనే జిల్లా కలెక్టర్ ఆలయ ఈ.ఓ కృష్ణ వేణి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మరో వైపు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ,కౌన్సిలర్లు ,నాయకులు కలెక్టర్ ను నీలదీసారు.ఈ నేపత్యం లో ఆలయ ఈవోకు కలెక్టర్ మెమో జారీ చేయాగా ,ఆలయ ఈ.ఓ ఒక ఏఈ ఓ కి షో కాజ్ నోటీసుఇచ్చి, ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసింది.
ఈ.ఓ పై విచారణకు కమిషనర్ వస్తున్నారా లేక కలెక్టర్ ఫిర్యాదుకు స్పందించి వస్తున్నారా అనే విషయం ఇంకా తేలలేదు.మొత్తానికి రెండు రోజుల నుండి ఆలయం లో గందర గోల పరిస్థితులు నెలకొన్నాయి.రెండు రోజుల క్రితమే వేములవాడ విచ్చేసిన కమిసినేర్ మల్లి ఎందుకు అర్జెంట్ గా వేములవాడ రావాల్సి వస్తుంది ఆలయ ఈ.ఓ పై వేటు పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.