34.2 C
Hyderabad
April 23, 2024 13: 36 PM
Slider ముఖ్యంశాలు

సర్కార్ బడులలో ఇంగ్లీష్ మీడియం హర్షించదగ్గ విషయం

#lelavati

తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 26 వేల స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం శుభ పరిణామం అని ‘విన్నపం ఒక పోరాటం’ వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. గ్రామాలలో తల్లిదండ్రులు అందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని, కెసిఆర్ తీసుకున్న నిర్ణయం హర్షించదగినదని దీనిని అందరూ స్వాగతించాలని అన్నారు.

పేద,మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, ఇంగ్లీష్ మాధ్యమంలో నైపుణ్యత లేక పోవడం వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులతో పోటీపడి రాణించలేక వెనుక పడుతున్నారని,

సిఎం నిర్ణయం భావితరాల వారికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

ఆర్థిక స్తోమత లేకపోవడంతో  తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు మీడియంలోనే చదివిస్తున్నారని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తపరుస్తున్నారని అన్నారు.ఇంగ్లీష్ మీడియంను సర్కారు బడుల్లో వ్యతిరేకించే వారికి వారి పిల్లలను, మనవరాళ్ళను,మనవళ్ళను ఇంగ్లీషు మీడియంలో చదివించుకుంటూ తెలుగు మీడియం గురించి గొప్పగా చెప్పే వారు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం నుండి తెలుగు మీడియం లోకి మార్చాలని హితవు పలికారు.

పేద పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే కచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండి తీరాల్సిందే అని లీలావతి ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర  టూరిజం కార్మిక శాఖ యూనియన్ సెక్రటరీ అనంతు నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షుడు హుస్సేన్ మియా,సురభి గురవయ్య,ప్రసాదు, వీరబాబు, శ్రీకాంత్ హర్షన్,వికాస్, హర్షిత,హేమ,ప్రజా ప్రతినిధులు,విద్యార్థి తల్లిదండ్రులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పగటి కలలు కంటున్న ప్రతిపక్షాలు

Satyam NEWS

దుర్గమ్మ ఏడ్చినా… కృష్ణమ్మ కన్నీళ్లు పెట్టినా కరగని జగన్

Satyam NEWS

తెలంగాణ కు భారీ వర్ష సూచన

Bhavani

Leave a Comment