28.7 C
Hyderabad
April 20, 2024 03: 03 AM
Slider తూర్పుగోదావరి

అన్నవరం దేవస్థానంపై ముగిసిన విజిలెన్స్ విచారణ

#annavaram

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం దేవస్థానంలో సోమ, మంగళవారాల్లో జరిగిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్  అధికారుల తనిఖీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. దేవస్థానంలో వివిధ విభాగాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకు న్నాయని 24 అంశాలపై దేవస్థానం పాలకమండలి సభ్యుడుకొరు చేసిన ఫిర్యాదు ఆధారంగా జరిగిన ఈ రెండు రోజుల  విచారణ అనంతరం సంబంధిత కొన్ని దస్త్రాలను తదుపరి విచారణను కొనసాగించే నిమిత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ వెంట కార్యాలయానికి   తీసుకుని వెళ్ళారు.

ఫిర్యాదులోని కొన్ని విషయాలు బహిర్గతం అయ్యనట్లు ప్రచారంలో ఉన్నాయి. భూతాది విభాగంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే 22 ఇత్తడి కళాయి గంగాళాలకు పాడైన అడుగు భాగాలను మార్చి వాటి స్థానంలో కొత్తవి అమర్చి మరమ్మతులు చేసినందుకు వాస్తవంగా రూ. 4 లక్షలు ఖర్చు అయ్యే దానికి బదులు ఒక్కో గంగాళానికీ రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 22 లక్షలు ఖర్చు అయ్యినట్టు పేర్కొనే ప్రయత్నం జరిగింది.

చైర్మన్ గా రోహిత్ అనర్హత, నిబంధనలకు విరుద్దంగా బంగ్లాను వినియోగిస్తున్నట్టు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి క్వార్టర్, వేద పాఠశాల నిర్మాణం, ఇటీవల 39 మంది వ్రత పురోహితుల నియామకం, పదోన్నతులు, దేవస్థానం కొండ స్థలంలో 303 ఎకరాల భూమిలో ఆక్రమణలు, గొంధి గ్రామంలో దేవస్థానానికి చెందిన భూముల కౌలు వేలం, రత్నగిరిపై కేంద్ర దుకాణాంనకు సంబంధించిన రసవర్గాల సరఫరా టెండర్ సమయంలో చూపించిన మాదిరి రసవర్గాలకు బదులు  దేవస్థానానికి నాసిరకం సరకులు సరఫరా చేయడం, ఎయిడెడ్గా జాయిన్ అయిన కొందరు ఆన్ ఎయిడెడ్లో విధులను నిర్వర్తించడం జరిగింది.

ఎన్ఎంఆర్ పోస్టులో ఒకరికి అక్రమ పదోన్నతి, కోర్టు ఆదేశాలున్నా కొందరు అర్హులకు పదోన్నతులు కల్పించక పోవడం, ఈవో, సహాయ కమిషనర్ 6 వీఐపీ గదులను ఉచితంగా వినియోగించు కోవడం, మోడేకుర్రు వేద పాఠశాలకు నెలకు రూ. 60,000 చొప్పున దేవస్థానం నిధులను విడుదల చేయడం, హుండీల్లో సమర్పించే పట్టు వస్త్రాలను పక్కదారి పట్టించడం, నకిలీ ధ్రువ పత్రాలతో ఉద్యోగాలు, పదోన్నతులు పొందడం చేశారు.

విద్యుత్ పరికరాల కొనుగోలు వ్యవహారం, రత్నగిరిపై దుకాణాల కేటాయింపులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ప్రచారంలో ఉంది. 2007 సంవత్సరంలో ఇదే దేవస్థానంలో ఇలానే పలు అక్రమాలు జరిగాయని అప్పటి పాలకవర్గంలోని ఓ సభ్యుడు విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేయగా, మళ్ళీ 14 ఏళ్ల తర్వాత తాజాగా మరో సభ్యుడు ఫిర్యాదు చేయడం, వీరిరువురూ కూడా తండ్రీ, కొడుకులు కావడం విశేషం.

Related posts

లైంగిక నేరాల్లో విచిత్ర తీర్పులు ఇచ్చిన జస్టిస్ పై సుప్రీంకోర్టు చర్య

Satyam NEWS

6,7,8 తేదీలలో మహిళాబంధు

Sub Editor 2

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా టీ.శ్రీనివాసరావు

Satyam NEWS

Leave a Comment