40.2 C
Hyderabad
April 19, 2024 16: 12 PM
Slider పశ్చిమగోదావరి

పంచాయితీ నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారుల విచారణ

#PedavegiMandal

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం గార్ల మడుగు పంచాయతీలో సుమారు 5 సంవత్సరాల క్రితం జరిగిన నిధుల దుర్వినియోగంపై డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపినట్టు తెలిసింది. 2016- 2017 కాలం లో పంచాయతీ కార్యదర్శి ఒకరు పెదవేగి మండల ఇంచార్జి ఈ ఓ పి. ఆర్ డి గా విధులు నిర్వహించారు.

ఆ సమయం లో గార్ల మడుగు పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా కూడా కొనసాగారు. అప్పట్లో ఆయన పంచాయతీ నుండి నిబంధనలకు విరుద్ధం గా  కార్యదర్శి తో మిలాఖత్ అయ్యి అక్రమ బిల్లులు పెట్టి పంచాయతీ సొమ్ములు కాజేశారని అభియోగం వచ్చింది. దీనిపై  జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీ రికార్డులతో పాటు సబ్ ట్రెజరీ కార్యాలయం లో ఏ విధమైన బిల్లులు పెట్టి ఎంత నిధులు డ్రా చేశారో ఏలూరు సబ్ ట్రెజరీ అధికారులను అడిగి తెలుసుకొనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Related posts

ఎమ్మిగనూరు మార్కెట్‌లో భారీగా పతనమైన టమాట ధర

Bhavani

విమర్శిస్తే బదులివ్వాలి కాని దాడులు చేస్తారా?

Murali Krishna

పటాన్ చెరు వద్దు రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment