29.2 C
Hyderabad
October 13, 2024 15: 25 PM
Slider సంపాదకీయం

ముంబై హీరోయిన్‌ ఎపిసోడ్‌పై చంద్రబాబు సంచలన నిర్ణయం

#harrasment

ఏపీలో సంచలనంగా మారిన ముంబయికి చెందిన నటికి ఎదురైన వేధింపుల వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముంబయి హీరోయిన్ జిత్వాని వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. నటి జిత్వానీతో ఆన్‍లైన్‍లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా దర్యాప్తు చేయాలని నిర్దేశించింది. అంతేకాక, ఈ ఘటనపై కమిటీని కూడా నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే బాధితురాలైన నటి వైసీపీ నాయకులతో పాటు.. కొందరు ఐపీఎస్ లపై కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో సంచలన ఆరోపణలు, అంతకుమించిన దారుణాలు వెలుగు చూస్తుండడంతో ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివరాలను ఏపీ సీఎంవోకు అందించారు. సీఎంవో ఈ కేసు విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. వ్యవస్థల్ని అడ్డు పెట్టుకొని ఇలా మాఫియా శైలిలో వేధింపులు జరిగిన తీరు చూసి సీఎంవో అధికారులే నివ్వెరపోయినట్లు తెలిసింది. పైగా అందులో సీనియర్ ఐపీఎస్ అధికారుల కనుసన్నల్లో ఈ వేధింపులు జరగడం అనేది మరింత సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారంలో కారకులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు అలాంటివారు మరింత చెలరేగిపోతారనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

సదరు కారకులైన ఆ ఐపీఎస్‌లు విశాల్ గున్నీ, కాంతిరాణా టాటాపై వేటు పడేలా చేయకపోతే.. మరికొందరు ఉన్నతాధికారులు భవిష్యత్తులో ఆ దారిలో వెళ్లే  అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పని మరొకరు చేయాలంటేనే దడ పుట్టేలాగా ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులపై చర్యలు ఉండేలా చేస్తున్నట్లుగా సమాచారం. అందుకే ఇప్పుడు ఆ కేసు పుర్వోత్తరాలు, లోతుపాతుల్ని బయటకు తీసి.. ఆయా పోలీసు అధికారులకు షోకాజ్ నోటీసులను జారీ చేయబోతున్నారు. ఇప్పటికే తనకు జరిగిన అన్యాయంపై నటి కాదంబరి జెత్వానీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆమె ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకంతో ధైర్యంగా అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తున్నారు. ఇలాగే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక ఈ కేసు సంచలనమే అవుతుందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు భరోసా ఇస్తున్నందున ఆమె బయటకు వచ్చి జరిగిందంతా చెబుతారని అంటున్నారు. తద్వారా ఆమెకు జరిగిన అన్యాయం, వైసీపీ నేతలు, వారి అండతో ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన బలుపు మొత్తం వెలుగులోకి వస్తుందని అంటున్నారు. తద్వారా ఆ ఐపీఎస్ అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించేలా ఏపీ ప్రభుత్వం యత్నిస్తుందని అంటున్నారు. మొత్తానికి ఈ కేసు విషయంలో మున్ముందు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Related posts

గెట్ రెడీ: వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్‌ టికెట్లు

Satyam NEWS

ఉత్తమ ఉపాధ్యాయురాలి అత్యుత్తమ ప్రతిభ

Satyam NEWS

విద్వేషం: స్వేరోస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Satyam NEWS

Leave a Comment