వైసిపికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై విచారణ ప్రారంభం కాబోతున్నది. రిజర్వు నియోజకవర్గం నుంచి గెలిచిన శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గం కాదంటూ గుంటూరు జిల్లా జేసీ కి ఫిర్యాదు అందింది. దాంతో ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి జేసీ ఆదేశాలు జారీ చేశారు. తాను ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు, బంధువులను వెంట తీసుకోవచ్చని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ కు నేరుగా ఫిర్యాదు వెళ్లింది. దీనిపై అనుకూలంగా రిపోర్టు పంపించాలని వత్తిడులు రావడం దాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం వ్యతిరేకించడం సత్యం న్యూస్ వీక్షకులకు తెలిసిందే.
previous post
next post