36.2 C
Hyderabad
April 16, 2024 19: 29 PM
Slider పశ్చిమగోదావరి

పంచాయితీ నిధుల స్వాహాపై విచారణ ప్రారంభం

#peadvegi

ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం పంచాయతీ నిధుల స్వాహా పై అధికారులు విచారణ చేపట్టారు. అమ్మపాలెం మహిళా సర్పంచ్ వేలి ముద్ర తో పాటు సంతకాన్ని కూడా ఆ పంచాయతీ గ్రేడ్ 1 కార్యదర్శి(పంచాయతీ డ్రాయింగ్ అధికారి)మండలం లో కొన్ని పంచాయతీలలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి తో కలిసి అమ్మపాలెం మహిళా సర్పంచ్ దేవరపల్లి ఏసు మరియమ్మ వేలి ముద్రతో పాటు సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి వీధి లైట్లు కొనుగోలు నిమిత్తం 79 వేల 990 రూపాయలు, పైపు లైన్ల రిపేర్ నిమిత్తం 86 వేల450 రూపాయలు మొత్తం 1 లక్షా 66 వేల 440 రూపాయల పంచాయతీ నిధులు కార్యదర్శి వై.సుప్రియ అనే ఒక మహిళ పేరుతో ఉన్న బాంక్ అక్కౌంట్ కి బదిలీ చేసినట్టు తెలిసింది.

పంచాయతీ ఎక్కౌంట్ నుండి ఎస్ బి ఐ ఏలూరు ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ ఎస్ బి ఐ  ఐ ఎన్ 0000836 గాను ఎక్కౌంట్ నంబర్ 20133354697 కి సి ఎఫ్ ఎం ఎస్ కోడ్ 1009321125 తో రెండు బిల్లులు తయారు చేసి ది 24/1/2023వ తేదీన పంచాయతీ నిధులు మొత్తం 86 వేల 440 రూపాయలు ఏలూరు స్టేట్ బాంక్ నుండి డ్రా చేయడానికి రెండు వేరు వేరు ఓచర్ లు రాసి  పక్కా ఆధారాలతో దొరికిపోయారు.

ఈ లక్షా 66 వేల 440 రూపాయల పంచాయతీ నిధులు ఎవరి పేరున ట్రాన్స్ఫర్ చేశారో  ఆ ఓ చర్ ల పై  ఏ డ్రాయింగ్ అధికారి సంతకముందో  మండల, జిల్లా అధికారులు పరిశీలిస్తే అసలు నిజాలు బయట పడతాయి. గతం లో ఇటువంటి పని చేసిన పెదవేగి మండలం మండూరు పంచాయతీ కార్యదర్శి  శ్రీనివాసరావు ని అప్పటి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు  సస్పెండ్ చేసి ఆ కార్యదర్శి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అప్పటి జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.

Related posts

మగ్గం తగలబెట్టిన చేనేత కార్మికునికి టీడీపీ చేయుత

Satyam NEWS

గ్లోబల్ వార్మింగ్ తో కరిగిపోతున్న హిమాలయాలు

Satyam NEWS

సహాయ కార్యక్రమాల్లో ఎన్జీఓలను భాగస్వామ్యులను చేయాలి

Satyam NEWS

Leave a Comment