February 28, 2024 08: 43 AM
Slider మహబూబ్ నగర్

మాజీ మంత్రి అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలి

#rachala

వనపర్తిలో  మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల కోసం వేసిన షెడ్లను, పర్నిచర్లను  తీసుకపోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత రాచాల యుగందర్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్థానిక  కాంగ్రెస్  కౌన్సిలర్లు,   నాయకులతో  కలిసి ఆర్ & బి ఎఈ సమక్షంలో రాచాల పరిశీలించారు.

ఈ సందర్బంగా రాచాల మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్, రేకుల షెడ్డులను తీసుకెళ్లుతున్నారని ప్రజల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆర్ అండ్ ‘బి ఏఈ సమక్షంలో పరిశీలించండడం జరిగిందని తెలిపారు. సామాన్య  ప్రజల కోసం వేసిన రేకుల షెడ్డులను మాజి మంత్రి నిరంజన్ రెడ్డి కనికరం లేకుండా తీసుకెళ్లారని, నియోజకవర్గ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్, రేకుల షెడ్డులు, ఏసిలు తీసుకుపోతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భద్రత ఏదని మండిపడ్డారు. ఏ అధికారికి సమాచారం ఇచ్చి క్యాంపు కార్యాలయంలో వస్తువులు  తీసుకెళ్ళాడో సంబంధిత అధికారులు తెలపాలని రాచాల డిమాండ్ చేశారు.

ప్రజల సొమ్మును తీసుకుపోతుంటే ఆపాల్సిన పోలీసులే బిఆర్ ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి ప్రజలకు, ప్రజా ధనానికి భద్రత కల్పించాలని, బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందన్న విషయం గ్రహించాలని కోరారు. ప్రజా ధనాన్ని లూటి చేసిన మాజి మంత్రి. నిరంజన్ రెడ్డిపై వెంటనే చోరీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా చెరువుల మరమ్మతులు, ఇతర పనులు చేసి ఎక్కువ బిల్లులు చేసుకుని  ప్రజా ధనాన్ని దోచుకున్న విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, ఆయన అవినీతిపై  విచారణ చేయించి ప్రజాదనాన్ని  కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత ఎమ్మెల్యేపై ఉందని అన్నారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజి మంత్రి నిరంజన్ రెడ్డిపై విచారణ చేసి, ఎంతటి వారైనా సరే వారిని జైలుకు పంపించాలని జిల్లా ఎస్పీని రాచాల  కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, కౌన్సిలర్లు సత్యం సాగర్, బ్రహ్మచారి, వెంకటేష్, సతీష్ ,శివ యాదవ్, శ్రీధర్ గౌడ్, రాము, నాయకులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అగ్ని వీర్ మహిళా పోలీసు విభాగానికి ఎంపికైన సునీత

Satyam NEWS

పోలీసు చొక్కాలు తీసేసి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయండి

Satyam NEWS

317 జీ ఓ సవరించాలి: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి వినతిపత్రం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!