39.2 C
Hyderabad
March 28, 2024 15: 45 PM
Slider సంపాదకీయం

370 రద్దు దేశం స్వాగతిస్తున్నది

article 370

రాజకీయ కారణాలు కావచ్చు లేదా బ్రిటీష్ పాలకులను మెప్పించడానికి కావచ్చు లేదా ముస్లిం వర్గాలను మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ను మచ్చిక చేసుకోవడానికి కావచ్చు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రూపొందించారు. ఆ నాటి నుంచి జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే కానీ ఏ అధికారం ఉండదు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఖర్చులన్నీ భారత్ ప్రభుత్వమే భరిస్తుంది కానీ అక్కడ ఏమీ చేయలేదు. జమ్మూ కాశ్మీర్ లోని రాజకీయ నాయకులు పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు కానీ భారత్ లో భాగమే అంటుంటారు. పాకిస్తాన్ అక్కడ చొరబడుతున్నా, పాకిస్తాన్ ఉగ్రవాదులు తిష్ట వేసుకుని ఉన్నా కాశ్మీర్ రాజకీయ నాయకులు ఎవరూ ఏమీ అనరు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పెట్రేగిపోవడం వల్ల దేశం మొత్తం అభద్రతా భావంలో ఉండాల్సి వస్తున్నది. జమ్మూ కాశ్మీర్ సురక్షితంగా లేకపోవడం వల్ల దేశం మొత్తం పెను ప్రమాదంలోనే ఉండిపోవాల్సి వస్తున్నది. ఇలాంటి వాతావరణానికి శాశ్వత పరిష్కారం కనుకొనడంలో ఇప్పటి వరకూ దేశాన్ని పాలించిన అన్ని రాజకీయ పార్టీలూ విఫలం అయ్యాయి. అయితే నరేంద్రమోడీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. ఆర్టికల్ 370 నిబంధనను ప్రకారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. ఆ కారణంగా వారు పాడిందే పాటగా ఇంతకాలం సాగింది. కేవలం రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ రంగాలపై మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఈ విధులు నిర్వర్తించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి అక్కడి ప్రభుత్వాలు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ కు ప్రస్తుతం సొంత రాజ్యాంగం కూడా ఉంది. అందువల్ల అక్కడ భారత ప్రభుత్వం ఏమి అనుకున్నా చేయలేకపోతున్నది. ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన) అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు. జమ్మూకశ్మీర్ లో శాశ్వత నివాసానికి సంబంధించిన నిబంధనల్ని నిర్వచించే ఆర్టికల్ 35 ఏ నిబంధన ఆర్టికల్ 370 లో భాగమే. దీని ప్రకారం జమ్మూకశ్మీర్ లో ఇతర రాష్ట్రాల ప్రజలు భూములు, ఆస్తులు కొనలేరు. ఆర్టికల్ 360 ద్వారా దేశమంతా ఆర్థిక అత్యవసర స్థితిని విధించవచ్చు. కానీ కశ్మీర్ లో మాత్రం అమలు చేయలేం. కేవలం విదేశీ దురాక్రమణ, యుద్ధం జరిగే పరిస్థితుల్లో మాత్రమే ఆర్థిక అత్యవసర స్థితిని అమలు చేయొచ్చు. ఆర్టికల్ 370 రద్దు వల్ల భారత్ కు సర్వాధికారాలు సంక్రమిస్తాయి. అందువల్ల దేశ ప్రజలంతా ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగానే ఉంటారు. ఈ ఒక్క చర్యతో ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి హీరో అయ్యారు. హీరోగానే ఉంటారు.

Related posts

నామినేషన్ దాఖలు చేసిన ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల

Satyam NEWS

ఉపాధి హామీ బిల్లులు 15లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవు

Satyam NEWS

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా టీ.శ్రీనివాసరావు

Satyam NEWS

Leave a Comment