39.2 C
Hyderabad
April 25, 2024 15: 08 PM
Slider పశ్చిమగోదావరి

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే మూర్చ‌వ్యాధి టీడీపీ ఆగ్ర‌హం

lokesh twitt1

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల‌నే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయి 150 మంది అస్వస్థతకు గురయ్యార‌ని ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే ఇక రాష్ట్రంలో ఉన్నమిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంద‌న్నారు. వెంటనే అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాల‌ని డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని, కలుషిత తాగునీరు కారణమని ప్రాథమికంగా త‌మకు స‌మాచారం అందుతోంద‌ని దీనికి పూర్తి బాధ్య‌త ప్ర‌భుత్వానిదే అని నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related posts

తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

మేదావుల పై నల్లచట్టాల ప్రయోగం న్యాయం కాదు

Bhavani

ప్రేమించాడు… పెళ్లాడాడు.. 12 ముక్కలుగా నరికాడు

Satyam NEWS

Leave a Comment