35.2 C
Hyderabad
April 20, 2024 15: 20 PM
Slider కృష్ణ

మంత్రి పేరుతో ESI కుంభకోణం నిందితుడు ‘కార్తీక్’ దందా

#kartik

‘ఈఎస్ఐ’ కుంభకోణంలో నిందితుడుగా ‘ కార్తీక్’ అనే వ్యక్తి మంత్రి పేరుతో దందా చేస్తున్నట్లు పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక మంత్రితో లావాదేవీలు కలిగి ఉన్నాడు.

మంత్రికి తెలిసే జరుగుతున్న ఈ వ్యవహారంలో సదరు వ్యక్తి ఇప్పటికే పలు రకాలుగా కోట్లది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మందుల సరఫరాదారులు, ప్రవేటు ఆసుపత్రుల నుంచి ఇతను భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. విజయవాడ ‘నోవాటేల్ ‘ కేంద్రంగా మంత్రి పేషీకి సమాంతర వ్యవస్థ ను ఈ వ్యక్తి నడుపుతున్నాడు.

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ESI కుంభకోణంలో ఇతను నిందితుడు. మంత్రి, ఉన్నతాధికారులు, ఉద్యోగులు తన కనుసన్నల్లో నడుస్తారని తాను చెప్పిందే ESI లో జరుగుతుందని చెబుతూ మందుల సరఫరా దారులు, ప్రవేటు ఆసుత్రుల బిల్లుల చెల్లింపులు, టెండర్ల పేరుతో అక్రమంగా  కోట్లలో వసూలు చేసినట్లు చెబుతున్నారు.

అంతేగాకుండా ESI లో తనకువ్యతిరేకంగా వ్యవహరించే అధికారులు, ఉద్యోగులపై ఎంక్వయిరీలు వేయించి సస్పైన్డ్ చేయిస్తానని బెదిరిస్తున్నట్లు  తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ESI లో  అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురు ఉద్యోగులపై విచారణ చేయించి, చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించింది తానే నని ‘కార్తీక్’ ఉద్యోగులను బెదిరింపులకు పాల్పతున్నట్లు చెబుతున్నారు.

ESI కుంభకోణంలో నిందితుడుగా ఉన్న ‘కార్తీక్’ ఆ శాఖ మంత్రి కుమారుడికి బెంజి కారు బహుమతిగా ఇచ్చారని గతంలో తెలుగుదేశం పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఇతని అక్రమ కార్యకలాపాలపై నిఘా వర్గాలు కూడా ఆరా తీసినట్లు సమాచారం. మంత్రి పేరుతో దందా చేస్తున్న తెలంగాణాకు చెందిన ‘కార్తీక్ ‘  వ్యవహారాలు సదరు శాఖా మంత్రికి తెలిసే జరుగుతున్నాయా లేదా అన్నదానిపై చర్చ జరుగుతున్నది.

ఇంతే కాకుండా కార్తీక్ చేసిన అక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నట్లు తెలుస్తోంది. కుంభకోణంలో జైలు నుంచి వచ్చిన అనంతరం విజయవాడలో ప్రముఖ హోటల్ ‘నోవాటేల్’  కేంద్రంగా గత 9 నెలల నుంచి సూట్ రూమ్ తీసుకుని ESI లో సమాంతర వ్యవస్థ నడుపుతున్నట్లు సమాచారం.

Related posts

టిటిడి ఉద్యోగుల జాతీయ స‌మ‌గ్ర‌తా ప్ర‌తిజ్ఞ‌

Satyam NEWS

[Over-The-Counter] Vitamins To Reduce Blood Sugar Home Remedy For Diabetes Ayurvedic Home Remedies For Diabetes

Bhavani

ఎనదర్ యాంగిల్: కోవిడ్ పేరుతో హక్కుల అణచివేత

Satyam NEWS

1 comment

Donette Bettencourt June 28, 2021 at 10:11 PM

Hi,

We’re wondering if you’ve ever considered taking the content from satyamnews.net and converting it into videos to promote on social media platforms such as Youtube?

It’s another ‘rod in the pond’ in terms of traffic generation, as so many people use Youtube.

You can read a bit more about the software here: https://www.vidnami.com/c/ybmsv-vn-freetrial

Kind Regards,
Donette

Reply

Leave a Comment