27.7 C
Hyderabad
April 20, 2024 02: 46 AM
Slider హైదరాబాద్

పేదలకు బియ్యం, పప్పు పంచిన కార్పొరేటర్ శ్రీదేవి

Sridevi

లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పేదలకు బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. నల్లకుంట డివిజన్ లోని గాంధీ నగర్ లంక బస్తీ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతల కు చెందిన 175 కుటుంబాలు ఈ నిత్యావసరాలను అందుకున్నాయి. నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కొక్కరికి  నిత్యావసర వస్తువులు 10 కిలోల  బియ్యం, కంది పప్పు, నూనె ప్యాకెట్, చింత పండు, కారం, పసుపు, శానిటైజర్ సబ్బులు తదితర వస్తువులను ఉచితంగా పంపిణి చేసినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు Ch. భగవాన్, నాగరాజ్ గౌడ్, k. శ్యామ్, హరి బాబు, j. కృష్ణ,, యాదయ్య, నర్సింహా, శ్రీనివాస్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నిధులివ్వాలి

Satyam NEWS

గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

ఇమ్మానియేల్ చర్చ్ లో ఘనంగా యేసు పునరుత్థాన పండుగ

Satyam NEWS

Leave a Comment