రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్బంగా ఆర్ధికంగా వెనుకబడి వున్న ఆర్యవైశ్య కుటుంబాలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్యవైశ్య యువజన సంఘము, వాసవీ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక యువజన సంఘ కార్యాలయం తేజా డిజిటల్స్ నందు సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల తేజా నిర్వహించారు. ఉయ్యారు మండలం యువజన సంఘ అధ్యక్షులు పేరూరి నిఖిల్, వాసవిసేవాదళ్ అధ్యక్షులు కొల్లిపర హేమంత్ విచ్చేసిన సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు. ముఖ్య అతిధులు గా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు, వాసవిసేవాదల్ జిల్లా చైర్మన్ నేరెళ్ల వేణు పాల్గొన్నారు.
previous post