27.7 C
Hyderabad
April 26, 2024 03: 51 AM
Slider విజయనగరం

పారిశుద్ధ్య కార్మికులూ మనుషులే.. అంటూ కరోనా సమయంలో సాయం…!

#Vijayanagaram

కరోనా పుణ్యమా..సమాజ వ్యాప్తంగా సాయం చేద్దామన్న ఆలోచన ప్రతీ ఒక్కరిలో కలుగుతోంది. థర్డ్ వేవ్ సంగతేమో గానీ ప్రస్తుతం ఈ సెకండ్ వేవ్ లో కేసులు తగ్గడంతో… ఇతరులకు సాయం చేసేందుకు వీరు ,వారు ఇలా ప్రతీ ఒక్కరూ ముందు కు వస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీలో అన్ని సంస్థలు ఏదో రూపంలో ఇతరులకు సాయపడేందుకు వివిధ రూపాలలో యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ని విజయనగరం జిల్లా కేంద్రం లో గూడ్స్ షెడ్ కూ చెందిన నిత్య అన్నదాన సేవా సంస్థ..పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేద్దామని ముందు కు వచ్చింది.

ఈ క్రమంలో నగరంలో ని గూడ్స్ షెడ్ వద్ద శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్ లో పారిశుద్ధ్య పని వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.

ఈ మేరకు మున్సిపల్ కార్పోరేషన్ హెల్త్ అధికారి సమక్షంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఉమాశంకర్ మీడియా తో మాట్లాడుతూ ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రతీ ఒక్కరినీ కుదేలు చేసిందని..అందున రోజువారీ వేతన జీవులకు కడు కష్టకాలం చేసిందన్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించి…నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో దాదాపు 50 మంది కార్మికులు సంస్థ అందించిన నిత్యావసర సరుకులను అందుకున్నారు.

Related posts

శాస్త్రోక్తంగా ప్రారంభమైన నమ్మాళ్వారుల అధ్యయనోత్సవాలు

Satyam NEWS

సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో ఓదెల రైల్వేస్టేష‌న్ సెకండ్ షెడ్యూల్

Satyam NEWS

IT Consulting Hourly Rates By Country and Specialization

Bhavani

Leave a Comment