30.3 C
Hyderabad
March 15, 2025 08: 57 AM
Slider హైదరాబాద్

జై జవాన్ కాలనీలో నిత్యావసరాల పంపిణీ

Pawani Manipal reddy

కరోనా లోక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదలకు నిత్యావసర సరుకులను డా.ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కార్పొరేటర్  పావని మణిపాల్ రెడ్డి నేడు జై జవాన్ కాలనీలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రజా ప్రతినిధులు పూనుకోవడం మంచి పరిణామమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలితో పడుకోకూడదు అన్నది సీఎం కేసీఆర్ సూచన అని అన్నారు.

ఈ మేరకు తామంతా ముందుకు వచ్చి తమ శక్తిమేరకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ గౌతమ్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు టి ఆర్ ఎస్ నాయకులు మణిపాల్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు బేతాళ బాలరాజ్ పాల్గొన్నారు. ఇంకా కార్యదర్శి సురేందర్రావు సీనియర్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, షేర్ మన్నెమ్మ, లక్ష్మీనారాయణ కుమారస్వామి, రామతులసి గోవర్ధన్ మట్ట రాజేశ్వర్ రెడ్డి  సింగం రాజు సీతారాం రెడ్డి బాల్ నరసింహ విల్సన్ సురేంద్రచారి యాకయ్య శ్రీనివాస్గౌడ్ రాజిరెడ్డి కాలనీ అధ్యక్షులు తిరుమలయ్య కమిటీ సభ్యులు అనుపురం కమిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మనిమోహన్దాస్ విజయేందర్రెడ్డి ఎస్ ఎల్ గ్రూప్  సభ్యులు ఉప్పలయ్య బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జీజీహెచ్ పారిశుద్ధ్య విభాగం ఉద్యోగికి మొదటి టీకా

Satyam NEWS

సీఎంఆర్ వేగంగా చేస్తాం మిల్లింగ్ రాష్ట్రంలోనే చేయండి

Satyam NEWS

సిన్సియర్ అధికారిపై జగన్ సర్కార్ బదిలీవేటు

Satyam NEWS

Leave a Comment