33.2 C
Hyderabad
April 26, 2024 01: 43 AM
Slider కరీంనగర్

ఏడేళ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయలేకపోయి ఈటెల

#ministergangula

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేస్తున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ రోజు హుజురాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని మారినా మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు నేరుగా నిధులు ఇవ్వలేదని అన్నారు. ఇళ్లు కట్టుకున్న యాభై ఏళ్ల తర్వాత కూడా మట్టి రోడ్డే ఇంటి ముందు ఉండేదని, సమైక్య పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేసారు.

స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీ, స్థానిక సంస్థల నిధులతో సంబందం లేకుండా ప్రభుత్వమే నేరుగా నిధుల్ని అందించాలని సంకల్పించి స్థానిక సంస్థల్ని బలోపేతం చేశారన్నారు. అన్ని మున్సిపాలిటీలు ఈ విధంగా దూసుకుపోతుంటే హుజురాబాద్ లో ఈటెల నిర్లక్ష్యంతో గతంలో ఉన్న రోడ్లు పూర్తిగా పాడయ్యాయని అన్నారు. మున్సిపాలిటీగా మారినా అభివృద్ధి చేయలేదన్నారు.

నిధులు రాబట్టలేకపోవడం, ఉన్న నిధుల్ని సైతం సరిగా ఖర్చు పెట్టకపోవడంతో మున్సిపాలిటీలో రోడ్లు అధ్వాన్నంగా ఉండేవన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులే అన్ని డిపార్మెంట్లను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని. ఏడేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈటెల అస్తవ్యస్తంగా హుజురాబాద్ మున్సిపాలిటీని మార్చేశారన్నారు.

ఈ దుస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోగానే తక్షణమే స్పందించి 35 కోట్ల రూపాయల్ని కేటాయించారని వీటిలో 25 కోట్ల రూపాయల్ని కేవలం డ్రైన్లు, రోడ్లకే కేటాయించామన్నారు. 140రోడ్లను డెవలప్ చేయడమే కాకుండా మిగతా 100 రోడ్లను ప్రస్తుతం డెవలప్ చేయాలని నిర్ణయించి పనులు ప్రారంభించామన్నారు.

10 కోట్లతో పైప్ లైన్ పనులు చేసామన్నారు. మరిన్ని పనులు పెండింగ్ లో ఉండడంతో మరోసారి సీఎం కేసీఆర్ మరో 15కోట్లను రిలీజ్ చేసారన్నారు. వీటితో మరో 150 రోడ్లను, బోర్నపల్లి ఇతర శివారు రోడ్లను డెవలప్ చేస్తున్నామన్నారు.

మరో నెల రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తయి హుజురాబాద్ అత్యద్భుతంగా డెవలప్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, వైస్ ఛైర్మన్ కొలిపాక నిర్మలా కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ వెంకన్న,  ఇతర ప్రజా ప్రతినిదులు, ఆర్ అండ్ డి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Related posts

రాత్రి సమయంలో విజయనగరం జిల్లా సరిహద్దుల్లో లేడీ పోలీసు బాస్ తనిఖీలు

Satyam NEWS

Demand: రైతులందరికి ఖరీఫ్ పంటకు ఋణాలివ్వాలి

Satyam NEWS

బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

Satyam NEWS

Leave a Comment