37.2 C
Hyderabad
March 28, 2024 18: 52 PM
Slider కరీంనగర్

మాట వినని అధికారులు, రాజకీయ నాయకులపై వేటు?

#EtelaRajendar

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్  అనుచరులను టార్గెట్ గా పెట్టుకొని టిఆర్ఎస్ నాయకత్వం  పావులు లు కదుపుతున్నది.

తద్వారా రానున్న రోజుల్లో ఈటెల ను రాజకీయంగా గా ఏకాకిని చేయాలని అని కేసీఆర్ వ్యూహం  రచించినట్లు తెలిసింది.  ఇందుకుగాను పక్కా స్కెచ్ లో భాగంగా  ఇప్పటికే హుజురాబాద్ ఎసిపి  శ్రీనివాసరావును బదిలీ చేయగా, రాజకీయంగా వీణవంక మండలంలో సింగిల్ విండో చైర్మనసాధవ రెడ్డి ని 18లక్షలు స్వాహా  చేసినట్లు నోటీసులు పంపారు.

దీనికితోడు తాజాగా ఈటల కు అతి దగ్గరగా ఉంటూ ఇటీవల జరిగిన పరిణామాలలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి వివరాలతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వీరిని ముందు  మాటలతో మెప్పించి దగ్గర తీసుకోవడo, మాట వినని వారి పై రాజకీయంగా, ఆర్థికంగా దాడి చేసి  నష్టం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఇందుకు ఇప్పటికే రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతారావు ను రంగంలోకి దింపిన విషయం  విదితమే. రాజకీయంగా కెప్టెన్ కు  హుజురాబాద్ తో విడదీయరాని అనుబంధం ఉంది. మొదటినుంచి రాజకీయంగా ఈటల తో  ఆయనకు విభేదం ఉన్నా కెప్టెన్ ఎక్కడ  బయటపడలేదు.

తాజాగా జరిగిన పరిణామాలతో  ఆయన నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఈటెలపై వ్యక్తిగతంగా  దాడి చేయడమే కాకుండా తన కుటుంబాన్ని రాజకీయంగా  ఈటల  ఏ విధంగా నష్టం చేయాలని చూసిన విషయాన్ని స్పష్టం చేశారు.

కెసిఆర్ కు కెప్టెన్ మొదటినుంచి సన్నిహితుడైన విషయం తెలిసి కూడా ఈటల తన ను రాజకీయంగా దెబ్బ తీయాలని చూసినా తను పార్టీ కోసం భరించానని చెప్పారు. ఈటెల కేసిఆర్ ఇచ్చిన అవకాశాలను వాడుకుని ఎదిగి  ఆయనపైనే దాడి చేసే స్థితి కి చేరుకున్నారని, ఇది రాజకీయంగా మంచి పద్దతి కాదని అన్నారు.

హుజురాబాద్ లో ఈటల కన్నా ముందు తాను  ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి నిర్వహించిన  విషయం విదితమే. తర్వాత జరిగిన పరిణామాలలో  ఈటల హుజురాబాద్ కు వచ్చినా కార్యకర్తలకు ఏ విధమైన సహాయం చేయలేదనీ ,తను పార్టీ కోసం నిర్మించిన పునాదులపై భోగాలు అనుభవించిన ఈటల తన మాట వినని వారిని తొక్కడం పనిగా పెట్టుకున్నాడని, వీటిని తను సహించే వాడిని కాదని ఆయన అన్నారు. 

ఈటెల హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేయకముందే  అధినేత  ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధం అనీ కెప్టెన్  ప్రకటించడం చూస్తే ఈటెల పై కేసీఆర్ ఎంతగా రాజకీయంగా మట్టు పెట్టాలని చూస్తున్నాడో అర్థం అవుతుంది. కేసీఆర్ కు ఈటల కు  ఏర్పడిన రాజకీయ  అగాథం లో  కెప్టెన్  ఈ అవకాశాన్ని తనవైపు తీసుకొని తన ఆధిపత్యాన్ని పునప్రతిష్టించుకోవాలని  భావిస్తున్నాడు.

ఇందుకు తన దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దుకుని రాజకీయ ఎదిగిన కార్యకర్తలను  తిరిగి తన వైపు  తిప్పి కుంటున్నారు. మాట వినని వారు జాబితా తయారుచేసి వారిని ఆర్థికంగా రాజకీయంగా దెబ్బ తీస్తే   మిగతా వారికి పార్టీ మాట వినకుంటే ఏం జరుగుతుందో అన్న సంకేతాన్ని చేర్చిన  వారమవుతమని భావిస్తూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

మామిడి రవీందర్ గౌడ్, హుజురాబాద్, సత్యం న్యూస్

Related posts

వాటర్ ప్లాంట్ యజమానులకు హెచ్చరిక.. అనుమతి లేకుంటే సీజ్

Satyam NEWS

ఆరుద్ర మహోత్సవం నాడు జంగమదేవర్లకు అన్న వస్త్రదానాలు

Bhavani

హుజురాబాద్ లో కుండపోతగా కురిసిన వర్షం

Satyam NEWS

Leave a Comment