30.7 C
Hyderabad
April 16, 2024 23: 52 PM
Slider తెలంగాణ

హెల్త్ ఐటి:ఆసుపత్రుల్లో రోగుల సేవలపై నజర్

etela rajender said govt working health for patients with it

ప్రజా ఆరోగ్యమే ప్రధాన బాధ్యత దిశగా తెలంగాణా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ మేరకు ఆసుపత్రుల్లో చేరే రోగులకు నిర్వాహకులు చెస్తున్న సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఐటి రంగం తో వైద్యరంగాన్ని అనుసంధా నిస్తు న్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ అన్నారు.ఆసుపత్రుల్లో రోగులకు అందించే సేవలు ఏవిధంగా అందుతున్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మై క్రిటిక్ ఫీడ్ బ్యాక్అప్లికేషన్ను అయన ఆవిష్కరించారు.

ఈ యాప్ ను స్వేఫ్న్ టెక్నాలజీస్ రూపొందించింది. యాప్ వినియోగ సాధ్యాసాధ్యాలపై మరింత అధ్యయనం చేసి వాటిని ప్రభుత్వం వినియోగించుకునే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోగి అనుభవం ఎలా ఉందో తెలుసుకుంటాం అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ఏ పనిచేసినా ఫీడ్ బ్యాక్ అనేది చాలా ముఖ్యం. ఆ ఫీడ్ బ్యాక్ తో యాజమాన్యాలు ప్రజల ఏం ఆశిస్తున్నారో వాటిని అందించవచ్చు.


టెక్నాలజీ పెరిగిన తరువాత ఫీడ్ బ్యాక్ అవశ్యకత మరింత పెరిగింది అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.అనేక రంగాల్లో ఐటీ అప్లికేషన్స్ వాడుతున్నాం, వైద్య రంగంలో కూడా వాటిని ఉపయోగించి పారదర్శకతను, ఖచ్చితత్వాన్ని పెంచి మరింత సంతృప్తి కరమైన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావల్సిన అవసరం ఉంది.

మై క్రిటిక్ పేరుతో ఈ రోజు ఫీడ్ బ్యాక్ యాప్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది.ఇలాంటివి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతాయి.ఒక రోగి ఆసుపత్రి కి వేస్తే రిసెప్షన్ దగ్గరనుండి డిశ్చార్జ్ అయ్యే వరకు అతనికి ఎదురైన అనుభవాలను ఈ యాప్ లో పొందుపరచవచ్చు. డాక్టర్స్ ఎన్ని సార్లు చూడడానికి వచ్చారు, వారు ఏ విధంగా చికిత్స అందించారు, హాస్పిటల్ లో పరిశుభ్ర త ఎలా ఉంది, అనే వివరాలు ఈ యాప్ లో నమోదు చేస్తే ఆసుపత్రిని నడిపేవారికి నేరుగా ఆ వివరాలు అందుతాయి.


టాంపరింగ్ కి అవకాశం లేకుండా దీనిని తయారు చేశామని నిర్వహకులు చెప్తున్నారు.దీని ద్వారా గణనీయమైన మార్పు తీసుకొని రాగలం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలెట్ గా దీనిని పెట్టి ఫలితాలు సమీక్షించుకుని అన్ని ఆసుపత్రులకు అనుసంధానం చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ , స్వెన్ టెక్నాలజీస్ ఎండి గంగుల కృష్ణ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యదర్శి నరేందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్స్ సురేందర్ రెడ్డి, శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

పాఠశాలను సందర్శించిన ఎంపిపి గూడెపు శ్రీనివాస్

Satyam NEWS

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Bhavani

కళ్లను దానం చేయడమే ఒక మహోన్నత కార్యం

Satyam NEWS

Leave a Comment