కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆకతాయికి దేహశుద్ధి చేశారు. బాన్సువాడలో ఓ యువతి టైలరింగ్ నేర్చుకుంటుంది. బీర్కూరు మండలం బైరాపూర్‌కు చెందిన యువకుడు టైలరింగ్ నేర్చుకుంటున్న యువతిని వేధిస్తున్నాడు. యువతి భయపడి మాట్లాడకపోవటంతో ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి మరింత ఎక్కువగా వేధించడం మొదలు పెట్టాడు. పిచ్చి పిచ్చి మాటలతో అసభ్య చేష్టలతో వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ విషయాన్ని సదరు యువతి టైలరింగ్ నేర్పే వారితో పాటు తన కుటుంబ సభ్యులకు తెలిపింది. అసభ్య పదజాలంతో మాట్లాడటంతో పాటు మానసికంగా వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో, ప్లాన్ ప్రకారం అమ్మాయి చేత ఫోన్ చేపించి.. బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాకు పిలిపించి చెప్పులతో చితకబాదారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.