27.7 C
Hyderabad
March 29, 2024 01: 32 AM
Slider విజయనగరం

క‌రోనా త‌గ్గిన వారు కూడా అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి

#Collector

” ప్రార్ధించే పెదువుల‌కున్నా సాయం చేసే చేతులు మిన్న‌” స‌రిగ్గా ప్ర‌స్తుత క‌రోనా కాలంలో ప్ర‌తీ ఒక్క‌రూ డాక్ట‌ర్ నే  దేవుడిగా కొలుస్తున్నారు. ఆ  కోవ‌లోని వ‌చ్చారు..ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చేరువ‌లో ఉన్న మిమ్స్ వైద్యులు. క‌రోనా పుణ్య‌మా జిల్లా యంత్రాంగం మిమ్స్  హాస్ప‌ట‌ల్ ను స్పెష‌ల్ కోవిడ్ సెంట‌ర్ గా ఏర్పాటు చేసింది.

గ‌తేడాదిలానే ఈ ఏడాది కూడా అక్క‌డ క‌రోనా సోకిన పేషెంట్ల‌కు వైద్యులు ఎన్నో సేవ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం నుంచీ జీతం తీసుకుంటున్న‌…త‌మ వ‌ద్ద కు వ‌చ్చే రోగికి  న‌యం చేయాల‌న్న ఒకే ఒక ల‌క్ష్యంతో మిమ్స్ వైద్య సిబ్బంది అంతా ప‌ని చేస్తున్నారు.

వారి స‌క్రమంగా వైద్యం అందించ‌డం వ‌ల్ల‌నే  క‌రోనాసోకిన దాదాపు 22 మంది మిమ్స్ నుంచీ కోలుకుని ఇంటి ముఖం ప‌ట్టారు. వారికి స‌రైన వైద్యం అందించ‌డంలో మిమ్స్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డా.సుబ్ర‌హ్మ‌ణ్యం ముఖ్య‌మనే చెప్పాలి.

ఈ మేర‌కు కోలుకున్న పేషెంట్స్ ను స‌గ‌ర్వంగా  ఇంటికి  పంపించేందుకు స్వ‌యంగా జిల్లా క‌లెక్ట‌ర్ ను ర‌ప్పించి ఆయ‌న చేతుల మీదుగా పండ్లు,బట్ట‌లు ఇప్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడూతూ క‌రోనా త‌గ్గిన‌ప్ప‌టికీ, కొన్నిరోజుల‌పాటు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని, ధైర్యంగా ఉండాల‌ని  సూచించారు.

నెల్లిమ‌ర్ల మిమ్స్ కోవిడ్ ఆసుప‌త్రి నుంచి, ప‌దిరోజుల చికిత్స అనంత‌రం, వ్యాధిని న‌యం చేసుకొని 22 మంది   డిస్‌ఛార్జి అయ్యారు. వీరికి జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో వైద్య బృందం వీడ్కోలు ప‌లికింది. వారికి వాహ‌నాలు ఏర్పాటు చేసి, స్వ‌స్థ‌లాల‌కు పంపించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్‌ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్…రోగుల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వ్యాధికి చికిత్స చేసుకున్న‌ప్ప‌టికీ, క‌నీసం ప‌దిరోజుల‌పాటు అయినా త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. 

వీలైనంత‌వ‌ర‌కూ ఇంట్లోనుంచి రాకుండా, ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని అన్నారు. వ్యాధిని ఎదుర్కొనాలంటే, మ‌నోధైర్యం చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వారికి వైద్యం ఏవిధంగా అందిందీ, మందులు, ఇంజ‌క్ష‌న్లు ఇచ్చిందీ లేనిదీ వాక‌బు చేశారు.

సిబ్బంది సేవ‌ల‌పై ఆరా తీశారు. కొన్నిరోజుల‌పాటు మందులను జాగ్ర‌త్త‌గా వాడాల‌ని సూచించారు. వారికి డ్రైఫ్రూట్స్‌, అవ‌స‌ర‌మైన మందులను పంపిణీ చేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో మిమ్స్ మెడిక‌ల్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ హ‌రికిష‌న్ సుబ్ర‌హ‌మ‌ణ్యం, మెడిక‌ల్ సూప‌రింటిండెంట్ ఐ.భాస్క‌ర‌రాజు, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ సి.రఘురామ్‌, ప్రిన్సిపాల్ సిహెచ్ ల‌క్ష్మీకుమార్‌, హెచ్ఆర్ నుంచి శ్రీ‌నివాస్‌, వెల్ఫేర్ ఆఫీస‌ర్ గిరిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

సెప్టెంబర్ 6న అంజలి,ఆండ్రియాల తారామణి

Satyam NEWS

ముదిరాజులను బి.సి “ఏ” లోకి చేర్చండి

Bhavani

విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

Satyam NEWS

Leave a Comment