31.7 C
Hyderabad
April 18, 2024 23: 13 PM
Slider సినిమా

ఆశిష్ గాంధీ, చిత్ర శుక్ల ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం

#EverGreenEntertainments

‘నాట‌కం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల‌రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నుంది. రాజ్‌కుమార్ బాబీ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

నిర్మాత‌లు బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ… “ఇదొక స‌స్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. సినిమా ప్రారంభ స‌న్నివేశం నుంచి ఆఖ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ క‌థ‌లోని మ‌లుపులు ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తాయి.

`నాట‌కం` త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆశిష్ గాంధీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌నున్నారు. `రంగుల రాట్నం`, `సిల్లీ ఫెలోస్‌`, `మా అబ్బాయి` చిత్రాల ఫేమ్ చిత్ర శుక్ల ఇందులో క‌థానాయిక‌. ఇత‌ర తారాగ‌ణం వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. డిసెంబ‌ర్ మొద‌టి వారం నుంచి రాజ‌మండ్రి, కాకినాడ‌, నిడ‌ద‌వోలు,  రంప‌చోడ‌వ‌రం, గుడిసె, రాజాన‌గ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతాం“ అని తెలిపారు. 

ఈ చిత్రానికి క‌థ‌: బాబీ ఏడిద‌, ర‌చ‌న‌: స‌ర‌దా శ్యా‌మ్‌, డీఐ-విజువ‌ల్ ఎఫెక్ట్స్ : బ‌ండారు సాయి శ్రీ‌కాంత్‌, కాస్టూమ్  డిజైన‌ర్ : రూప‌రేఖ గుత్తి, ఛాయా గ్ర‌హ‌ణం: హ‌రిక్రిష్ణ (బెంగ‌ళూర్‌), సంగీతం: పెద్ద‌ప‌ల్లి రోహిత్‌, నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ.

Related posts

ముక్కు అందం కోసం వెళితే.. రెండు కాళ్ళూ పోయాయి!!!

Sub Editor

నేరాంద్రప్రదేశ్ గా మారిన ఆంధ్రప్రదేశ్

Bhavani

అయోధ్య రాముడి మందిరానికి అందరూ సహకరించండి

Satyam NEWS

Leave a Comment