21.7 C
Hyderabad
December 2, 2023 04: 36 AM
Slider తెలంగాణ

ఇక నుండి ప్రతి శుక్రవారం హరిత శుక్రవారం

4_480

ఇక నుండి ప్రతి శుక్రవారాన్ని హరిత శుక్రవారంగా పాటించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. దీనిలో భాగంగా రేపు శుక్రవారం నుండి ప్రతి శుక్రవారం హరిత శుక్రవారంగా పాటిస్తూ పెద్ద ఎత్తున రోజంతా మొక్కలను నాటడం, నగరవాసులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ క్రింది చర్యలు చేపట్టాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ ఎం.దానకిషోర్ లు ఆదేశాలు జారీచేశారు…

1.ప్రతి శుక్రవారం అన్ని స్వచ్ఛ ఆటోలు, వివిధ విభాగాలైన ఎంటమాలజి, అర్బన్ బయోడైవర్సిటీ, ఇంజనీరింగ్ ల వద్ద ఉన్న వాహనాల ద్వారా నర్సరీల నుండి మొక్కలు తరలించి ఇంటింటికి పంపిణీ చేయాలి.

2.ఏరియా కమిటీలు, వార్డు కమిటీల సభ్యులు, స్వయం సహాయక మహిళలు, సీనియర్ సిటీజన్లను హరితహారంలో భాగస్వామ్యం చేయాలి.

3.నగరంలోని నిర్ణయించిన ఖాళీ స్థలాల్లో హరితహారం మొక్కలను పెద్ద ఎత్తున నాటే కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ద వహించాలి.

4.నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హరితహారంలో తప్పనిసరిగా పాల్గొంటారు.

5.మాన్సూన్ మానిటరింగ్ పర్యవేక్షక అధికారులుగా నియమితులైన అడిషనల్ కమిషనర్లు, హెచ్.ఓ.డిలు తమకు కేటాయించిన సర్కిళ్లలో హరితహారంలో పాల్గొనాలి.

6.ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రేటిలను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలి.

7.ప్రతి శుక్రవారం ఒక్కో సర్కిల్ లో కనీసం 50వేల మొక్కలను నాటడం, ఉచితంగా పంపిణీ చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

8.ప్రతి హరితహారం కార్యక్రమ వేదిక వద్ద ప్లాస్టిక్ రహిత బ్యానర్లను మాత్రమే ప్రదర్శించాలి.

9.హరితహారం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కోలాహలంగా నిర్వహించాలి.

10.నాటే మొక్కలు అన్నింటికి జియోట్యాగింగ్ ను చేపట్టాలి.

11.డిప్యూటి కమిషనర్లు, ఇతర విభాగాల సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు కార్యక్రమాన్ని రూపొందించాలి.

Related posts

షర్మిలకు మోదీ ఫోన్: మండిపడుతున్న జనసేన

Satyam NEWS

మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కిన సాయి కల్యాణి

Bhavani

ప్రత్యామ్నాయ విధానాల సాధనకోసం ఐక్య పోరాటాలు  

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!