39.2 C
Hyderabad
April 23, 2024 15: 32 PM
Slider రంగారెడ్డి

కూలి అవసరమైన ప్రతి వారూ లేబర్ కార్డు పొందాలి

#Job card

ప్రతి కులీ లేబర్ కార్డు పొందాలని జన్ సహస్ బోర్డ్ డైరెక్టర్ నవీన్ కుమార్ కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం గండీడ్  మండల పరిధిలోని గాడిర్యాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని చికర్ల బండ తండాలో ముంబాయి, పుణె వలస వెళ్లి లాక్ డౌన్ కారణంగా తిరిగి వచ్చిన వలస కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కులీ  లేబర్ కార్డు పొందే విధంగా  సంస్థ కృషి చేస్తుందని  పేర్కొన్నారు. జిల్లా నుండి లక్షల మంది కూలీలు వలస వెళ్లి కులీ పనులు చేస్తున్నారని కాని వారిలో చాల మందికి లేబర్ కార్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక ఉద్యోగికి ఏవిధంగా అయితే గుర్తింపు ఉంటుందో అలాగే కూలీకి కూడా ప్రభుత్వం తరపున గుర్తింపు కార్డు ఉంటుందని తెలిపారు. ఈ లేబర్ కార్డును ప్రతి కులీ ఆన్ లైన్ లో నమోదు చేసుకుని కార్డు పొందాలని సూచించారు.  లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతున్న వారికి సంస్థ తరపున సహాయం చేస్తున్నట్లు తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో పరిగి నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే కార్మికులను కుడా సంస్థ తరపున పంపించామన్నారు. ప్రస్తుతం ముంబాయి, పుణె నుండి తిరిగి వచ్చిన ఈ ప్రాంతాల కార్మికులకు సంస్థ తరపున నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు కూలీలకు  లేబర్ కార్డు పొందేలా సంస్థ కృషి చేస్తోంది అని పేర్కొన్నారు.

అనంతరం ఎంపీపీ మాధవి రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..వలస కూలీల కోసం జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. కూలీలు అందరూ లేబర్ కార్లను కలిగి ఉండాలని వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 

ప్రతి భవన నిర్మాణ కార్మికులు మరియు కూలీలు లేబర్ కార్డులను కలిగి ఉండాలని  సూచించారు. కార్మికుల  కోసం కూలీల కోసం తండాలు, గ్రామాలు తిరుగుతూ   కార్యక్రమాన్ని నిర్వహించి నందుకు సంస్థ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జన్ సహస్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాశ్, సర్పంచ్ వెంకట్ రాంరెడ్డి ,అంబేడ్కర్ విజ్ణన వేదిక జిల్లా అధ్యక్షుడు టి.వెంకటయ్య, సభ్యులు అశోక్, వెంకటేష్, ఎల్లప్ప,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

కడప జిల్లా బద్వేలు లో జగనన్న వసతి దీవెన

Satyam NEWS

అనంతనాగ్‌ అర్వానీలో ఎన్‌కౌంటర్

Sub Editor

హుజూర్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన

Bhavani

Leave a Comment