27.7 C
Hyderabad
April 24, 2024 10: 32 AM
Slider ప్రత్యేకం

రోడ్డు ప్ర‌మాదాల్లో నా వాళ్లంద‌రినీ కోల్పోయాను…!

#vijayanagarampolice

క‌రడుగ‌ట్టిన ఖాకీ  హృదయాల‌నే క‌రిగించిందో  అతి  పిన్న వ‌య‌స్సు బాధితురాలు. రోడ్డు ప్రమాదాల్లో వ‌రుస‌గా త‌న‌వాళ్లంద‌రినీపొగొట్టుకున్నానంటూ క‌న్నీటిప‌ర్యంతం అయ్యిందా బాదితురాలు. వ‌ర‌ల్డ్ డే ఆఫ్ రిమంబ్రెన్స్ రోజునే…పోలీసుల మ‌న‌సులంతా ఒక్క‌సారి ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అక్టోబ‌ర్ 21  పోలీసుల అమ‌ర‌వీరుల దినోత్స‌వం…నవంబ‌ర్ 21  వ‌ర‌ల్డ్ డే ఆఫ్ రిమంబ్రెన్స్ …ఈ రెండిటి పోలీస్ శాఖ ప్ర‌తీ ఏటా జరుపుతూవ‌స్తోంది. ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపికా ఆధ్వర్యంలో పోలీస్ బ్యారెక్స్ లో  ఈ వ‌ర‌ల్డ్ డే ఆఫ్ రిమంబ్రెన్స్ జ‌రిగింది. 

ఈ సంద‌ర్బంగా  ట్రాఫిక్ పోలీసులు స‌మ‌క్షంలో  రోడ్డు ప్ర‌మాదాల‌ను జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న ఆర్టీసీ,లారీ,ఆటో,వ్యాన్ డ్రైవర్ల‌తో పాటు రోడ్డు ప్ర‌మాదంలో స‌ర్వం కోల్పోయిన బాధితుల‌ను పోలీస్ కార్యాల‌యానికి పిలిచి అందులో ముగ్గురుని ఎస్పీ దీపికా స్వ‌యంగా స‌త్క‌రించారు.ఈ సంద‌ర్బంగా జరిగిన కార్య‌క్ర‌మంలో పొల‌య్య‌పేట‌కు చెందిన బాదితురాలు హేమ‌ల‌త‌…కంట వెంబ‌డి నీరు ఆగలేదు.

గుండెలు అవిశేలా ఏడ్సిన హేమలత

బాధితులెవ్వ‌రైనా మాట్లాడాల్సిందిగా డీసీఆర్బీ సీఐ వెంక‌ట‌రావు కోర‌డంతో…హేమ‌ల‌త వ‌చ్చి ఇలా మైక్ అందుకోగానే…ఏమీ మాట్లాడ‌కుండానే క‌న్నీరు పెట్టుకుంది. అంద‌రూ ఉండ‌గానే…ఒక్క‌సారిగా బాధితురాలు ఏడ‌వ్వ‌డంతో ఎస్పీదీపికా స్వ‌యంగా లేచి ఆమెను ఓదేర్చేయ‌త్నం చేసినా..గుండ‌ల‌విసేలా రోధించింది. దీంతోఅక్క‌డి వాతావ‌ర‌ణం మొత్తం నిశ్శ‌బ్దంగా మారిపోయింది.

ఈ హ‌ఠాత్ ప‌రిణామం చూసి..ఎస్పీ నే.. ఏఆర్ ఆర్ఎస్ఐ నీలిమ‌ను బాదితురాల‌ను జాగ్ర‌త్త‌గా చూడ‌మ‌ని చెప్ప‌డంతో ఆమెకు మంచి నీళ్లు ఇచ్చి ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు.అనంత‌రం ఎస్పీ మాట్లాడుతూ…రోడ్డ ప్ర‌మాదాలు జ‌రిగితే.. కోలుకోలేనివిదంగా ప్ర‌తీ ఒక్క‌రికీ  దెబ్బ‌త‌గులుంద‌న్నారు.అందుకు స‌జీవ సాక్ష్య‌మే…మ‌న ముందు అంద‌రినీ కోల్పోయినా ఈ బాధితురాలు అని ఎస్పీ  అన్నారు.

ట్రాఫిక్ నియమనిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి

రోడ్డు మీద‌వెళ్లేట‌ప్పుడు ప్ర‌తీ ఒక్క‌రిబాధ్య‌త ఏమ‌రుపాటులేకుండా  జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్నారు.అస్స‌లు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త పోలీస్ శాఖ  అందున ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్ర‌దాన ల‌క్ష్యం  అయిన‌ప్ప‌టికీ…నివార‌ణ చ‌ర్య‌లు ప్ర‌తీ ఒక్క‌రూ పాటించాల‌న్నారు. మన దేశంలో ఇతర కారణాలతో చనిపోయినవారి సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ ఆవేదన వ్యక్తం చేసారు.

వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యం వహించడం, చిన్న చిన్న మానవ తప్పిదాలు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా అంబులెన్సులకు మార్గంను ఇవ్వాలని, తద్వారా సకాలంలో బాధితులు చికిత్స పొంది, వారి ప్రాణాలును కాపాడగలిగే వారమవుతామన్నారు. ఏదైనా పని మీద వెళ్ళే సమయంలో సకాలంలో బయలుదేరి గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలని, త్వరగా వెళ్ళాలనే లక్ష్యంతో వేగంగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రజలను కోరారు.

మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు

అంత‌కుమందు  ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న‌రావు మాట్లాడుతూ ..చాలారోడ్డు ప్ర‌మాదాలు మాన‌వ‌త‌ప్పిదాల కార‌ణంగానే జరుగ‌తున్నాయని…సాక్షాత్ నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక‌లోనే వెల్ల‌డైంద‌న్నారు.

రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు, హేమలత మాట్లాడుతూ అర్ధంతరంగా తమ కుటుంబ జీవితంలో ఏర్పడిన ఇబ్బందులను ప్రజలకు వివరించి, తాము పడిన ఆర్ధిక ఇబ్బందులు, మానసిక వేధన వర్ణనాతీతమని, అటువుంటి ఇబ్బందులు ఇంకెవ్వరూ పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని కన్నీరు పర్యంతమయ్యారు. .

వివిధ రంగాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేసిన వ్యక్తులను, ప్రమాదరహితంగా వాహనాలు నడిపిన డ్రైవర్లు, ప్రమాద బాధితులను రక్షించి వైద్య సేవలందించిన వారిని, క్షతగాత్రులను తరలించి వారి ప్రాణాలను నిలిపేందుకు కృషి చేసిన వారిని జిల్లా పోలీసు శాఖ గుర్తించి వారికి జ్ఞాపికలను అందజేసి, శాలువలతో సత్కరించారు.

డాక్టర్ హరి జగన్, డాక్టర్ వెంకటేశ్వరరావు, తన 33సం.ల సర్వీసులో ఒక్క రోడ్డు ప్రమాదం చేయకుండా సురక్షితంగా విధులు నిర్వహించిన ఆర్టీని డ్రైవరు ఎన్.ఎస్.ఎన్.రాజు, లారీ డ్రైవరు జి. జయరాం, ఆటో డ్రైవర్లు బి. అప్పారావు, బి.సన్యాసిరావులను జిల్లా ఎస్పీ సాలువతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసారు. అనంతరం, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన మృతుల కుటుంబాలకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీని జిల్లా పోలీసు కార్యాలయం నుండి దిశ పోలీసు స్టేషను వరకు జ‌రిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి. సత్యన్నారాయణరావు,  విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎఆర్ డి ఎస్సీ ఎల్. శేషాద్రి, డా. వెంకటేశ్వరరావు, డా. హరి జగన్, సీఐలు బి.మెకటరావు, జి.రాంబాబు, రుద్రశేఖర్, జె.మురళి, టి.ఎస్.మంగవేణి, ఆర్ఐ మరియస్ రాజు, పి.నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు, ఎస్ఐలు నీలకంఠం, తారకేశ్వరరావు, కృష్ణవర్మ, శంకరరావు, సూర్యనారాయణ, సూర్యారావు, ఆర్ఎస్ఐ నీలిమ, ఇతర పోలీసు అధికారులు, ఆటో డ్రైవర్లు, రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలు, ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

క్వారీ పేరిట ఇసుక అక్రమ దందా

Satyam NEWS

పాత్రికేయుల సంక్షేమo కోసం అకాడమి కృషి

Satyam NEWS

మంత్రి చెల్లుబోయినపై ఎంపి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment