జగ్గయ్యపేట జనసేన నాయకులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైశ్యరత్న చారు గుండ్ల వెంకట లక్ష్మి నారాయణ(కొండ) వనం మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పచ్చదనం పరిశుభ్రత కొరకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆల్ ఇండియా విభాగ గ్లోబుల్ చీఫ్ అడ్వైజర్ సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి. బండారు సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా మొక్కలను అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు వైశ్యరత్న చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధ్యేయం మొక్కలను విరివిరిగా పెంచి వనాలుగా మార్చి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని కొండ పిలుపునిచ్చారు. ప్రతి శాలువాలు బొకేలు నిషేధించి మొక్కలను బహుమతిగా అందించి వాటిని మనమే సంరక్షించి కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సెక్రెటరీ ఎల్.వి కుమార్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ జనరల్ సెక్రెటరీ పసుమర్తి మల్లికార్జునరావు, మహిళా విభాగ అధ్యక్షులు కావ్య నాయకురాలు, విభాగాల మహిళలు పాల్గొన్నారు.