త్వరలోనే నూతన జిల్లాల వారిగా మత్స్యకార సొసైటీ ల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ లో రొయ్య పిల్లలను మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన విడుదల చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కు ముందు మత్స్యకారులను ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం 80 కోట్ల చేప పిల్లలు అన్ని నీటి వనరులలో విడుదల చేశామని, అలా విడుదల చేసిన చేపలపై పూర్తి అధికారాలు మత్స్యకారులకే ఇచ్చామని ఆయన అన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రయోజనం ప్రతి మత్స్యకారుడికి అందాలని, మత్స్యకారులు చేపలు విక్రయించుకునేందుకు సబ్సిడీపై వాహనాలు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు.
previous post