39.2 C
Hyderabad
March 29, 2024 13: 23 PM
Slider చిత్తూరు

కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా వుంది

తిరుపతి కళాకారుల సంక్షేమ సంఘం “సుబ్బరాజు నాట్య కళాపరిషత్” తిరుపతి వారి 58వ వార్షిక కళా సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా శనివారం మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో “మాయాబజార్” నాటక అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అధ్యక్షత వహించిన నవీన్ కుమార్ రెడ్డి ప్రసంగించారు.

మన సంస్కృతి సంప్రదాయాలను,పౌరాణిక నాటకాలను,కళాకారులను,కళలను అంతరించిపోకుండా భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మంత్రి మండలి పై ఉందని ఆయన అన్నారు.

తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో సుబ్బరాజు నట శిక్షణాలయం ద్వారా ఎన్నో పౌరాణిక నాటకాలను ప్రదర్శించి కళాభిమానుల ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమాని ఆయన అన్నారు.

తిరుపతిలో శనివారం “మాయాబజార్”నాటక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు అందరిని సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో కళాపోషకులు బ్లిస్స్ హోటల్ అధినేత మబ్బు సూర్యనారాయణ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, దుశ్శాలువలతో,మెమెంటో లతో ఘనంగా సత్కరించి అభినందించారు.

Related posts

జర్నలిస్టుల కరోనా వైద్య సహయ కోసం సమన్వయకర్తలు

Satyam NEWS

ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభలు

Bhavani

డీపీఆర్ఓ ఆధ్వ‌ర్యంలో జర్న‌లిస్ట్ ల‌కు కరోనా వ్యాక్సిన్…!

Satyam NEWS

Leave a Comment