37.2 C
Hyderabad
April 19, 2024 12: 34 PM
Slider ఆధ్యాత్మికం

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

#sivaswamy

ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ప్రవచనాలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని,భక్తితో ఏదైనా సాధించవచ్చునని అన్నారు.

దేశంలోని అనేక హిందూ దేవాలయాల పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా ఆలయాల పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు.భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను,విలువలను కాపాడాలని కోరారు.భారతదేశంలో హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు ఎంతో గౌరవం,గుర్తింపు ఉందని,ధర్మ పరిరక్షణకు కంకణ బద్దులై ముందుకు సాగాలని అన్నారు. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో చావా సహదేవరావు,త్రిపురమళ్ళ అంజయ్య,గజ్జి ప్రభాకర్,కుక్కడపు రామ్మోహన్ రావు,కె. నాగేశ్వరరావు,శాఖమూరి రవికుమార్ చౌదరి,డాక్టర్ శివప్రసాద్ చౌదరి,వేముల నరసయ్య,గుండా శ్రీనివాస్,ఏలూరి రాంబాబు,వెంకటరెడ్డి,రవీందర్ లక్ష్మయ్య, నలమాల శ్రీనివాస్,గార్లపాటి శ్రీనివాస్,గెల్లి అప్పారావు,శేఖర్,వెంకట నరసయ్య, పోలిశెట్టి నరసింహారావు,రామారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

తల్లుల్లారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం క్షమించండి

Satyam NEWS

ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ

Satyam NEWS

వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ ని బదిలీ చేయండి

Satyam NEWS

Leave a Comment