37.2 C
Hyderabad
April 19, 2024 11: 03 AM
Slider తూర్పుగోదావరి

మోసపూరిత  ఋణ యాప్ ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి

#kakinadapolice

మోసపూరిత  ఋణ యాప్ ల పట్ల జాగ్రత్త వహించాలని, లోన్ యాప్స్ అనేక దారుణాలకు కూడా కారణం అవుతున్నాయని కాకినాడ జిల్లా ఎస్ పి M.రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు. లోన్ యాప్స్‌లో రుణాలు తీసుకొనేవారి స్మార్ట్‌ఫోన్లలోని కాంటాక్ట్స్, ఇతర వ్యక్తిగత సమాచారం యాప్ నిర్వహించేవారికి చేరుతుందని ఆయన తెలిపారు. రుణం తీసుకున్నవారు EMI చెల్లించడంలో విఫలం అయితే ఈ వ్యక్తిగత సమాచారంతో వారిని మానసికంగా వేధించడంతో పాటు, వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి చెబుతామని, పరువు తీస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.

రుణాలు ఇచ్చే యాప్‌ల ప్రతినిధులు అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, డిఫాల్టర్ల చిత్రాలను ‘రేపిస్ట్’ లేదా ‘భికారీ నంబర్ 1’, దొంగ వంటి ట్యాగ్‌తో మార్ఫింగ్ చేయడం, చనిపోయినట్లు ప్రకటించడం, వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యుల ఫోటోలను అశ్లీలంగా మార్చి ఇంటర్నెట్ లో పెట్టి మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా చదువుకుంటున్న యువత, మహిళలు ఈ ఆన్ లైన్ ఇన్ స్టెంట్ లోన్ యాప్ ల పట్ల ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ పి కోరారు.

అనధికార లోన్ యాప్ లను ఇన్స్టాల్ చేసేటప్పుడు కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరా లకు సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వొద్దని, రుణాలు తీసుకునే విషయంలో బ్యాంకుల్ని, ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల్ని ఆశ్రయించడమే శ్రేయస్కరమని SP విజ్ఞప్తి చేసారు. ఇప్పటికే కాకినాడ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో లోన్ యాప్ మోసాల పట్ల ఫ్లెక్సీలు, కరపత్రాలు, వీడియోలు మరియు  సోషల్ మీడియా వేదికగా, మహిళా పొలుసులు, వాలంటీర్ల  మరియు వినూత్నంగా కళాజాత బృందాల ద్వారా జిల్లాలో అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

Related posts

భార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Satyam NEWS

అలెర్ట్ :రాజాసింగ్ హౌస్అరెస్ట్ఉత్తర తెలంగాణలో నెట్ కట్

Satyam NEWS

ధర్మపురి కాలనీ మురుగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment