30.7 C
Hyderabad
April 24, 2024 01: 10 AM
Slider ముఖ్యంశాలు

సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలి

#deogovindarajulu

ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏడు రోజులపాటు ఆన్లైన్లో నిర్వహించే జవహర్లాల్ నెహ్రూ జాతీయ సామాన్య గణిత పర్యావరణ ప్రదర్శనకు ప్రతి పాఠశాల నుండి రెండు ప్రదర్శనలను రూపొందించాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ప్రధానోపాధ్యాయులు ఆదేశించారు.

విద్యార్థులు తరగతి గదులు, పాఠ్యపుస్తకాలకే పరిమితమైపోయేలా కాకుండా సమాజానికి దోహదపడేలా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఆన్లైన్ సమావేశంలో డీఈవో మాట్లాడుతూ 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆన్లైన్ లో నిర్వహించే సైన్స్ ఫెయిర్ ను మార్చి 14 వ తేదీ నుండి16వ తేదీలోగా   ప్రదర్శనలను ఆరు ప్రధాన అంశాల్లో

ప్రదర్శనలను తయారు చేయాలన్నారు. తయారీలో సాంకేతికత ఉప అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

1. పర్యావరణ అనుకూల పదార్థము

2. ఆరోగ్యము, పరిశుభ్రత

3. సాఫ్ట్ వేర్, యాప్స్

4. రవాణా

5. పర్యావరణం, వాతావరణంలో మార్పులు

6. గణిత నమూనాలు

పై అంశాల నుండి జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాల( ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలు)లలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థుల నుండి తప్పనిసరిగా రెండు ప్రదర్శనలను ప్రతి పాఠశాల నుండి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.

ఆన్లైన్లో నమోదు చేయటానికి అవసరమైన గూగుల్ ను సంబంధిత గ్రూపులలో పంపిస్తారు. వీటితో పాటు” భారత శాస్త్రీయ విద్యా సంస్థ” అనే అంశంపై సెమినార్ కూడా నిర్వహిస్తున్నారు.

ఈ అంశంపై ఆరు నిమిషాల వీడియోను సిడి డివిడి లేదా పెన్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి మార్చి 15వ తేదీలోగా  జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి కి అందజేయాలన్నారు. అదేవిధంగా పదవ తరగతిలో ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలతో ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు.

తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టుల్లో సామర్థ్యాలను పెంపొందించాలి అన్నారు. ప్రత్యేక తరగతులకు వచ్చే విద్యార్థులకు అల్పాహారాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల నుండి అందే విధంగా ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు.

ఇప్పుడు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు గత రెండు సంవత్సరాల నుండి ఎలాంటి పరీక్షల్లో పాల్గొనలేదని ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు నిష్ణాతులుగా తయారుచేసే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ఆ విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లో జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, సెక్టోరల్ అధికారులు సతీష్ కుమార్, వెంకటయ్య, సూర్య చైతన్య, ఏసీ రాజశేఖర్ రావు, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్ల శెట్టి తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

నిర్మాతలకు వరం: “ప్రొడ్యూసర్ బజార్ – బెటర్ ఇన్వెస్ట్”

Satyam NEWS

వనపర్తి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

Satyam NEWS

మాచర్లలో మరోసారి హై అలర్ట్.. ముస్లింల మధ్య వైసీపీ చిచ్చు..!

Satyam NEWS

Leave a Comment