28.7 C
Hyderabad
April 25, 2024 04: 21 AM
Slider ఆదిలాబాద్

ఇంకా కరోనా టీకా తీసుకోని వారిని గుర్తించేందుకు సర్వే

#adilabadcollector

అర్హత కలవారు ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండకూడదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున మునిసిపల్ పరిధిలోని టిఎన్జిఓ భవనం(సెంట్రల్ గార్డెన్) లో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం, బృందావన్  కాలనీలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన వారి సమాచారం, కోవిడ్ టీకా తీసుకున్న, తీసుకోని వారి వివరాలు సేకరించాలని, ఇప్పటి వరకు టీకా తీసుకోని వారికి మొదటి డోస్ ఇప్పించాలని, మొదటి డోస్ తీసుకుని ఉండి రెండవ డోస్ తీసుకోని వారికి వెంటనే ఇప్పించాలని అన్నారు.

సంబంధిత వార్డులో స్పెషల్ ఆఫీసర్ పర్యటించాలని, ఆశ, అంగన్వాడీ, మెప్మా సిబ్బంది గల టీం లు ప్రతీ ఇంటిలోని వారి సమాచారం సేకరించాలని అన్నారు. వార్డుల్లో ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ, వ్యాక్సిన్ అందించాలని, ప్రతీ ఇంటిని టచ్ చేయాలని అన్నారు. మునిసిపల్ రిసోర్స్ పర్సన్ లను వినియోగించుకోవాలని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యత మునిసిపల్, వైద్య సిబ్బందిపై ఉందని తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను వెంటనే యాప్ లో అప్లోడ్ చేయాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించేందుకు వైద్యాధికారి సెల్ నెంబర్ తెలపాలని అన్నారు. ముందస్తు ప్రణాళికలతో ప్రతి ఒక్కరికీ టీకా పంపిణీ జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సాధన, మునిసిపల్ కమీషనర్ శైలజ, మునిసిపల్ ఈఈ వెంకటశేషయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, వైద్య,మునిసిపల్,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకo

Murali Krishna

మాస్క్ లేకుంటే విద్యార్ధుల్ని కాలేజీకి రానివ్వద్దు

Satyam NEWS

పెళ్లి వేడుకకు ఊటీ వెళ్లి వస్తే ఇల్లు లూటీ

Satyam NEWS

Leave a Comment