28.2 C
Hyderabad
April 20, 2024 14: 06 PM
Slider నల్గొండ

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రూపొందించిన సినిమానే రైతన్న

#rnarayanamurthy

రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతన్న చిత్రాన్ని విజయవంతం చేసినందుకు సహకారం అందించాలని ఆర్ నారాయణమూర్తి శానంపూడి సైదిరెడ్డి ని కలిసి విజ్ఞప్తి చేశారు.

అనంతరం పట్టణంలోని సాయిబాబా  థియేటర్లో మధ్యాహ్నం మ్యాట్నీ షో ను కార్యకర్తతో వీక్షించిన అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ రైతన్న సినిమా విజయవంతం కావాలని,కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులు ఆదాని, అంబానీలకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు.రైతులను కూలీలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని నటుడు నారాయణమూర్తి తీసిన సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. నారాయణమూర్తి ప్రజాచైతన్యం కోసం, పెట్టుబడి,భూస్వామ్య వ్యవస్థల రద్దు కోసం తీసిన విప్లవాత్మక సినిమాలు విజయవంతమై ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు.

సిఎం కెసిఆర్ లాంటి వారు రైతుల గురించి ఆలోచించి 24 గంటలు ఉచిత విద్యుత్, రైతు అప్పు చేయకుండా రైతు బంధు పేరుతో పెట్టుబడి అందించడం,రైతు ఋణ మాఫీ చేయడం,రైతులంతా కలిసి ఒకే దగ్గర కూర్చునేలా రైతు వేదికలు ఏర్పాటు చేయడం లాంటి గొప్ప పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణా రాష్ట్రం అన్నారు.

అన్నదాతలు కొన్ని నెలలుగా ఢిల్లీలో రైతులకు వ్యతిరేక చట్టాలకు ధర్నాలు చేస్తున్నారని,చట్టాల రద్దుకు రైతుకు లాభం కలిగించేందుకు ఈ సినిమా ఎంతో దోహదపడుతుందన్నారు.

అనంతరం సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలు కార్పొరేట్ రంగానికి రెడ్ కార్పెట్ వేసే విధంగా ఉన్నాయన్నారు.ఈ చట్టాలు అమలుకు భారతదేశం లాంటి దేశంలో రైతు కూలీగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకే దేశం, ఒకే మార్కెట్,ఒకే వ్యవసాయం అమెరికా వంటి దేశాల్లో సాధ్యమవుతుంది తప్పా భారతదేశం లాంటే పేద రైతులు ఉన్న దేశంలో సాధ్యం కాదన్నారు.

ఎకరాలు ఉన్న రైతులు ఎక్కడకో వెళ్లి ఎలా అమ్ముకుంటాడు అని ప్రశ్నించారు.గత ఎనిమిది నెలలుగా రైతులు చలి,ఎండ,వానను లెక్క చేయకుండా చేస్తున్న ఉద్యమాన్ని చూసి చలించిపోయి ఈ చిత్రాన్ని తీశానని అన్నారు.2006 లో బీహార్లో ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల అక్కడ రైతులు కూలీలుగా మారారు అని, చట్టాలతో దేశాన్ని కార్ఖానాగా తయారు చేస్తారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైతుకు గిట్టుబాటు ధర కోసం 2006 లో జరిగిన ఉద్యమంలో మూడు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని,అప్పుడు యూపీఏ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ వేసిందని కానీ ఆ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు.2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సు లను అమలు చేస్తానని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన సినిమాలు ఈ ఉద్యమాలను చూపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చట్టాలను రద్దు చేయాలని కోరారు.

సినిమా క్లైమాక్స్ లో ఆర్టికల్ 246 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నల్ల చట్టాలను రద్దు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి వ్యవసాయం దండగ కాదు పండుగ అని చిత్రీకరించినట్లు తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

58 జిఓ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

Bhavani

అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

Satyam NEWS

పోలీసు ఉద్యోగాలకు ములుగులో ఫ్రీ కోచింగ్

Satyam NEWS

Leave a Comment