28.2 C
Hyderabad
April 20, 2024 11: 59 AM
Slider ఆంధ్రప్రదేశ్

బాబ్రీ మసీద్ పై తీర్పు ఎలా ఉన్నా స్వాగతిద్దాం

vijayawada 03

బాబ్రీ మసీద్ రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని యూత్ వెల్ఫేర్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి అన్నారు. నేడు విజయవాడ వాగు సెంటర్ లో ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద మత సామరస్యానికి ప్రతీకగా అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి అన్నదానం కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా యూత్ వెల్ఫేర్ గత ఏడు సంవత్సరాల నుండి వివిధ  కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రామ మందిర్ బాబ్రీ మసీదు వివాదం పై ధర్మాసనం తీర్పును అందరూ సమర్ధించాలని ఆయన కోరారు. భారతదేశ పౌరులు వెయ్యి కళ్ళతో ఈ తీర్పు కోసం వేచి ఉన్నారని ఆయన అన్నారు. తీర్పు ఎటు వచ్చినా ఇరువర్గాలు సామరస్యం, సమన్వయం పాటించలే తప్ప ఒకరి గెలుపు ఒకరి ఓటమి అని అనుకోకుండా భారతదేశం గొప్ప గెలుపు గా భావించాలి అని షిబ్లి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న విజయవాడ పోలీస్ కమిష నర్,  వన్టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ ను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పంపించి యూత్ వెల్ఫేర్ అధ్యక్షులు షిబ్లిని శాలువా కప్పి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ యూత్ వెల్ఫేర్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం నిజంగా అభినందనీయం భారతదేశం అన్ని కులాలు మతాల  కలయిక అన్న విషయాన్ని ఈ రకంగా తెలియజేయడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వెల్ఫేర్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు హర్ మహేందర్ సింగ్ సహని, విజయవాడ యూత్ వెల్ఫేర్  అధ్యక్షులు జాకిర్,  జహూరు, రఫీ, రషీద్, మస్తాన్ తదితర సభ్యులు మరియు చిట్టి నగర్ ఈద్గా సభ్యులు పాల్గొన్నారు.

Related posts

బయోఇన్ఫర్మేటిక్స్ మీద అతిధి ఉపన్యాసం

Satyam NEWS

నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుంది

Satyam NEWS

అవినాష్ రెడ్డి ఓటమికి అన్ని యత్నాలూ చేస్తున్న సునీత

Satyam NEWS

Leave a Comment