28.7 C
Hyderabad
April 25, 2024 06: 25 AM
Slider రంగారెడ్డి

మంత్రి ప్రారంభించాక..మళ్లీ ప్రారంభించడం ఏమి సంస్కారం?

#uppal

స్థానికుల మధ్య చిచ్చు పెట్టడమే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబం లక్ష్యం అని టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గిరిబాబు ఆరోపించారు. కుషాయిగూడ దోబీ ఘాట్ లో సోమవారం మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు ఆధునిక యంత్రాలను ప్రారంభించారు.

ఈ క్రమంలోనే కార్పొరేటర్ నుంచి మంత్రుల వరకు జిల్లా అధికారులు రెండు రోజులు ముందుగానే సమాచారం అందించారు. ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేసేందుకే మంత్రి మల్లారెడ్డి ప్రారంభించాక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తిరిగి ప్రారంభించడం ఏం సంస్కారం అంటూ కాప్రా ప్రెస్ క్లబ్ లో సోమవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గిరిబాబు ప్రశ్నించారు.

ఎక్కడి నుంచో వచ్చి చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేతో పాటు మేమంతా స్థానికులమే అయినప్పటికీ మాకు పదవులు వద్దు అనుకోని పార్టీకి కట్టుబడి మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు కులాల పేరుతో రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోమని నేమూరి మహేష్ గౌడ్ హెచ్చరించారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోకపోతే నువ్వు కూడా అరవ సోదరులని కించపరిచేలా మాట్లాడావ్. వారితోనే మీ ఇంటి ముందు ఆందోళన చేసే పరిస్థితి వస్తుందన్నారు. మా ఇంటి ఆడబిడ్డ గా మీకు ఇస్తున్న గౌరవాన్ని కాపాడుకోకుండా మాపైనే నిందలు వేస్తే సహించేది లేదన్నారు.

బొంతు కుటుంబానిదే నేరచరిత్ర…

భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ బొంతుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో  నమోదైనది నిజం కాదా అని నాయకురాలు గిరక బావి సురేఖ సూటిగా ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి కొత్త రామారావు చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాసం మైపాల్ రెడ్డి సుడుగు మహేందర్ రెడ్డి కుమారస్వామి గంప కృష్ణ సారా వినోద్ ముదిరాజ్, రాకేష్ ఉపేందర్ శ్యామ్ పడమటి మల్లారెడ్డి చంద్రమౌళి శోభారాణి మంజుల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు సత్యంన్యూస్.నెట్, మేడ్చల్ జిల్లా

Related posts

డివైన్ పవర్: రేపటితో ముగియనున్న అధ్యయనోత్సవాలు

Satyam NEWS

ప్రకాశం జిల్లా దరిశి లో మేడే ఎర్రజెండాలు ఆవిష్కరణ

Satyam NEWS

ఆకాశ హర్మ్యం బుర్జు ఖలీఫా కట్టిన కంపెనీ దివాలా

Satyam NEWS

Leave a Comment