26.7 C
Hyderabad
May 1, 2025 05: 14 AM
Slider తెలంగాణ

అసమ్మతితో అజ్ఞాతంలోకి జోగు రామన్న?

jogu_ramanna_2763

అంతా సజావుగా సాగుతున్నదనుకుంటున్న సమయంలో టిఆర్ఎస్ లో అసమ్మతి స్వరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రిపదవి ఆశించి భంగపడ్డ అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే జోగు రామన్న ఆలక బూనారు. మొదటిసారి కెసిఆర్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన జోగు రామన్న ఈ సారి జరిగే మంత్రివర్గ విస్తరణలో పదవి వస్తుందని ఆశించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో దఫా విస్తరించిన మంత్రివర్గంలో ఆయనకు అవకాశం కల్పించలేదు. దాంతో తనకు అవకాశం రాలేదని మనస్తాపం చెంది తన వాడుకుంటున్న క్వార్టర్స్, గన్ మెన్ లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. రామన్న నేడు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా హాజరు కాకపోవడంతో తన అస మ్మతిని కొనసాగిస్తున్నాడని జోగు రామన్న అనుచరుల తెలిపారు.

Related posts

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Satyam NEWS

“తెలంగాణ బత్తాయి డే” బ్రోచర్ ఆవిష్కరణ

Satyam NEWS

కేటీఆర్ జన్మదిన సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!