రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ పట్టణం అభివృద్ధి కోసం మునిసిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో కొల్లాపూర్ పట్టణంలో మెయిన్ రోడ్డు ఇరువైపులా పాదచారుల కొరకు గ్రానైట్ టైల్స్ తో ఫుట్ పాత్ రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. విడతలవారీగా రూ. 20 కోట్ల నిధులు విడుదల అవుతుండగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా దశలవారీగా చేపట్టారు. ఇప్పుడు ఆ రూ. 20 కోట్ల బడ్జెట్ నుండి మూడు కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. దాంతో శుక్రవారం నాడు ముగ్గు పోయించి అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట ప్రభుత్వం అభివృద్ధి కోరుకుంటుందని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ 9 న కొల్లాపూర్ ఆర్అండ్ బి అతిథి గృహం ముందు పాదచారుల కొరకు బస్ డిపో వరకు గ్రానైట్ ఫుట్ పాత్ రోడ్డుకు శిలాఫలకాన్ని ఆయనే వేశారు. ఇప్పుడు ఆ నిధులు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు.
previous post