26.7 C
Hyderabad
May 1, 2025 05: 54 AM
Slider మహబూబ్ నగర్

సీనియర్ కార్యకర్త పాడె మోసిన జూపల్లి కృష్ణారావు

jupally 27

చిన్నంబావి మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి అనారోగ్యం తో నిన్న మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు Asp నరసింహ రెడ్డి ని పరామర్శించారు.

ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తో ఉన్న అనుబంధాన్ని జూపల్లి గుర్తు చేసుకున్నారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు నమ్మిన బంటుగా ఉంటూ ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఆయన సేవలు చేశారని అన్నారు. అటు గ్రామంలో కూడా మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని, తనకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తనతో స్థిరంగా నిలబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. వెంకట్రామిరెడ్డి ఆత్మకు శాంతి చేకురాలని దేవుడిని ప్రార్థించారు. అనంతరం కర్మ కాండలో పాల్గొని ఆయన పార్ధివదేహాన్ని మోశారు. అంతిమ యాత్ర చివరిదాకా దాదాపు 2 గంటల సమయాన్ని కేటాయించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రారెడ్డి, టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీచూపల్లి యాదవ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తేజారెడ్డి, చిన్నంబావి సర్పంచ్ రంజిత్ కుమార్, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, యూత్ అధ్యక్షుడు కానుగల రాజు, టీఆరెస్ వి అధ్యక్షుడు శంకర్, నరేష్, రాజు ఇతర టి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

పోడు హక్కు కోసం గ్రామసభలు

Murali Krishna

జీవో నంబర్ 1 రద్దు చేయాల్సిందే!..

Satyam NEWS

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

mamatha

Leave a Comment

error: Content is protected !!