తెలుగుదేశం హయంలో తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కమలం గూటికి చేరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో మంత్రిగా పని చేసిన దేవయ్య ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ నుండి చోప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలై ఇంటికే పరిమితమైన సుద్దాల దేవయ్య ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు జరిపారనీ నేడో రేపో బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కెసీఆర్ స్వయంగా ఆహ్వనించిన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లెందుకు మీనమేషలు లెక్కించగా చివరికి టిఆర్‌ఎస్ పార్టీ తలుపులు మూసుకున్నాయని పార్టీ అధిష్టానం ప్రకటించింది.ఈ లోగా రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దేవయ్య చోప్పదండి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పక్నఏ ఉన్న జగిత్యాల నియోజక వర్గానికి చెందిన దళిత నాయకుడు దేవయ్యకు సామాన్య ప్రజల్లో మంచి పేరుంది. శుభ ఆశుభ కార్యలకయిన వెళుతూ ప్రజలకు అండగా ఉండే దేవయ్య రాకతో బిజెపి పార్టీ ఈ నియోజక వర్గంలో బలోపేతమవుతుందనడంలో ఏలాంటి సందేహం లేదు.
previous post